Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'పెద్ది' ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

'పెద్ది' ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

వార్త 2 months ago

Peddi : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన మోస్ట్ అవేటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద తొలిరోజే కలెక్షన్ల సునామీ సృష్టించింది.

ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మొదటి రోజే ఏకంగా రూ. 110 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులను లిఖించింది. ప్రముఖ బాక్సాఫీస్ ట్రాకింగ్ సంస్థ ‘Sacnilk’ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ సినిమా కేవలం భారతదేశంలోనే రూ. 80 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకుంది. ఇందులో మెజారిటీ వాటా రెండు తెలుగు రాష్ట్రాల (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) నుంచే రావడం విశేషం. తెలుగు ఇండస్ట్రీలో రామ్ చరణ్ మాస్ పవర్‌ను మరోసారి నిరూపిస్తూ, కేవలం ఏపీ, తెలంగాణల నుంచే రూ. 67 కోట్ల భారీ వసూళ్లు నమోదయ్యాయి. థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం, పాజిటివ్ టాక్‌తో ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని ఓపెనింగ్స్ సాధించింది.

Read Also : పెద్ది తో రామ్ చరణ్ రెండేళ్ల కష్టం ఫలించిందా?

ఓవర్సీస్‌లోనూ హవా.. వంద కోట్ల క్లబ్‌లో చేరిన 11వ చిత్రంగా రికార్డు!

తెలుగు రాష్ట్రాలతో పాటు గ్లోబల్ మార్కెట్‌లోనూ ‘పెద్ది’ చిత్రం ప్రభంజనం సృష్టిస్తోంది. ఓవర్సీస్ (విదేశీ) మార్కెట్‌లో రామ్ చరణ్‌కు ఉన్న క్రేజ్‌ను చాటుతూ తొలిరోజే అక్కడ రూ. 28 కోట్ల నుండి రూ. 30 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ప్రవాసాంధ్రులు, అంతర్జాతీయ సినిమా ప్రియులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ అద్భుతమైన వసూళ్లతో, భారతీయ సినిమా చరిత్రలో విడుదలైన మొదటి రోజే రూ. 100 కోట్ల గ్రాస్ మార్కును దాటిన అతికొద్ది చిత్రాల సరసన ‘పెద్ది’ నిలిచింది. ఇప్పటివరకు ఈ ఘనత సాధించిన చిత్రాల్లో 11వ సినిమాగా నిలిచి సరికొత్త మైలురాయిని అందుకుంది. వీకెండ్ (శని, ఆదివారాలు) కలెక్షన్లు మరింత జోరుగా సాగే అవకాశం ఉండటంతో, రాబోయే రోజుల్లో ఈ సినిమా మరిన్ని ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

'పెద్ది' సినిమా కోసం జపాన్ నుంచి హైదరాబాద్‌కు అభిమానులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha