Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Peddi Movie: వైరలవుతున్న జగపతిబాబు కొత్త లుక్

Peddi Movie: వైరలవుతున్న జగపతిబాబు కొత్త లుక్

వార్త 4 months ago

టాలీవుడ్ ఫ్యామిలీ హీరో, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్న జగపతి బాబు, రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న 'పెద్ది' సినిమా (Peddi Movie) కోసం తన లుక్‌ను పూర్తిగా మార్చుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.

'అప్పల సూరి' అనే కీలక పాత్ర కోసం ఆయన బరువు తగ్గి, వయసు ముదిరిన వ్యక్తిలా కనిపించేలా ప్రత్యేక మేకోవర్ తీసుకున్నారు. ఆయన కొత్త రూపం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో 'రంగస్థలం' చిత్రంలో రామ్ చరణ్‌తో కలిసి నటించిన జగపతి బాబు, మరోసారి ఈ చిత్రంలో కనిపించనున్నారు. ఏప్రిల్ 30న ఈ సినిమా విడుదల కానుంది.

Suhas: 'హే భగవాన్' ట్రైలర్ రిలీజ్

క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొత్త ఇన్నింగ్స్

జగపతి బాబు బర్త్ డే సందర్భంగా ఈ పిక్ రిలీజ్ చేశారు మేకర్స్. గతంలో కూడా జగ్గూ భాయ్‌కి సంబంధించిన పిక్ ఒకటి షేర్ చేయగా, అది కూడా నెట్టింట వైరల్ అయింది. ఇక జగపతి బాబు గతంలో కూడా పాత్ర కోసం తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఈసారి 'పెద్ది' కోసం తీసుకున్న మేకోవర్ మాత్రం మరింత విభిన్నంగా ఉండటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. ఒకప్పుడు హీరోగా మెప్పించిన ఆయన, తర్వాత విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస విజయాలతో తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha