Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Ustad Bhagat Singh: పార్తిబన్ ఫస్ట్ లుక్‌ విడుదల

Ustad Bhagat Singh: పార్తిబన్ ఫస్ట్ లుక్‌ విడుదల

వార్త 4 months ago

వర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustad Bhagat Singh) పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ హైప్ నెలకొనగా, తాజాగా మరో కీలక అప్డేట్ ఆ ఆసక్తిని మరింత పెంచింది.

ఈ చిత్రం నుంచి ప్రముఖ నటుడు పార్తిబన్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో పార్తిబన్ 'నల్ల నాగప్ప' అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. విడుదలైన ఈ లుక్ సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది.

Suhas: 'హే భగవాన్' ట్రైలర్ రిలీజ్

అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది

'గబ్బర్ సింగ్' కాంబో అయిన పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ ల ఈ క్రేజీ చిత్రం మార్చి 26న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. విడుదలైన నల్ల నాగప్ప పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ -పార్థిబన్ మధ్య జరిగే ఫేస్ ఆఫ్ సన్నివేశాలను దర్శకుడు హరీష్ శంకర్ ఎలా డిజైన్ చేశారో చూడాలని అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్‌కు మంచి స్పందన లభించగా, త్వరలోనే రెండో పాటను కూడా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కథన రచన బాధ్యతలను దర్శకుడు దశరథ్ నిర్వహిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha