Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సూర్య 'విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌' రిలీజ్ డేట్ ఫిక్స్!

సూర్య 'విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌' రిలీజ్ డేట్ ఫిక్స్!

వార్త 2 weeks ago

Viswanand and Sons Release Date: తమిళ స్టార్ హీరో సూర్య పుష్కరకాలం (12 ఏళ్ల) తర్వాత బాక్సాఫీస్ వద్ద సాలిడ్ సక్సెస్ అందుకొని ఫుల్ ఫామ్‌లోకి వచ్చారు.

ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'వీరభద్రుడు' థియేటర్లలో వసూళ్ల సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తమిళంలో 'కరుప్పు' పేరుతో విడుదలైన ఈ సినిమాకు ప్రారంభంలో మిక్స్‌డ్ టాక్, యావరేజ్ రివ్యూలు వచ్చినప్పటికీ, కలెక్షన్ల పరంగా మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.280 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన ఈ చిత్రం, త్వరలోనే ప్రతిష్టాత్మక రూ.300 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టేందుకు దూసుకుపోతోంది. ఈ భారీ విజయంతో వచ్చిన ఊపులోనే సూర్య తన తదుపరి క్రేజీ సినిమా రిలీజ్ డేట్‌ను అధికారికంగా అనౌన్స్ చేశారు.

Read Also : Shamita Shetty Comments:'ముసలితనం వచ్చేస్తోంది' అన్న ట్రోలర్..ఏజ్ షేమింగ్‌పై నటి షమితా శెట్టి బోల్డ్ కౌంటర్!

Viswanand and Sons Release Date: సూర్య మొదటి స్ట్రెయిట్ తెలుగు సినిమా: 'విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌'

సూర్య హీరోగా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌'. సూర్య కెరీర్‌లో ఇదే మొట్టమొదటి స్ట్రెయిట్ తెలుగు సినిమా కావడం విశేషం. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో 'ప్రేమలు' బ్యూటీ మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే సీనియర్ నటీమణులు రవీనా టాండన్, రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, టైటిల్ టీజర్‌కు ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది.

రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆగస్టు 14న థియేటర్లలోకి!

ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ బక్రీద్ పండుగ సందర్భంగా ప్రేక్షకులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. 'విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌' చిత్రాన్ని స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా 2026, ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ అనౌన్స్‌మెంట్ సందర్భంగా విడుదల చేసిన సరికొత్త పోస్టర్‌లో సూర్య వర్షంలో గొడుగు పట్టుకొని, మొబైల్ చూస్తూ క్లాసీగా కనిపించిన స్టైలిష్ లుక్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

'కరుప్పు' హిట్ ఎఫెక్ట్.. పెరిగిన సూర్య సినిమా డిమాండ్

నిజానికి 'విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌' సినిమాపై నిన్న మొన్నటి వరకు ట్రేడ్ వర్గాల్లో పెద్దగా బజ్ లేదు. టీజర్ బాగుందనే టాక్ వచ్చినప్పటికీ పెద్దగా చర్చలు జరగలేదు. కానీ, ఎప్పుడైతే 'కరుప్పు' (వీరభద్రుడు) తెలుగు, తమిళంలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిందో, అప్పటి నుంచి సూర్య కొత్త సినిమాకు భారీ క్రేజ్, విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ సినిమా ఒక వైవిధ్యమైన కథాంశంతో రూపుదిద్దుకుంటోంది. 40 ఏళ్ల వయసున్న వ్యక్తికి, 20 ఏళ్ల యువతికి మధ్య జరిగే సున్నితమైన భావోద్వేగాలతో కూడిన ఒక అందమైన ప్రేమకథను దర్శకుడు వెంకీ అట్లూరి తనదైన శైలిలో వెండితెరపై చూపించబోతున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఎన్టీఆర్ అంటే పేరు కాదు.. అదొక శకం! నాన్న జయంతి వేళ బాలకృష్ణ ఎమోషనల్ పోస్ట్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha