Peddi Movie Ticket Price: తెలంగాణలోని సినీ ప్రేక్షకులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. మోస్ట్ అవేటెడ్ టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీ 'పెద్ది' సినిమా విడుదలను పురస్కరించుకుని థియేటర్లలో టికెట్ ధరలను భారీగా పెంచుకునేందుకు అనుమతినిస్తూ తెలంగాణ ప్రభుత్వం మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన చిత్రాలకు ఇచ్చే ప్రత్యేక రాయితీల్లో భాగంగానే ఈ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వం విడుదల చేసిన తాజా జీవో ప్రకారం.. సినిమా విడుదలైన రోజు నుండి వరుసగా 10 రోజుల వరకు ఈ పెంచిన టికెట్ ధరలు తెలంగాణవ్యాప్తంగా అమల్లో ఉంటాయి.
Read Also: Peddi:పెద్ది ట్రైలర్ విమర్శలపై డైరెక్టర్ బుచ్చిబాబు క్లారిటీ
తెలంగాణవ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సాధారణ టికెట్ ధరపై అదనంగా రూ. 100 వరకు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. అలాగే అధునాతన మల్టీప్లెక్స్ స్క్రీన్లలో ప్రతీ టికెట్‌పై అదనంగా రూ. 125 వరకు పెంచుకోవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా, సినిమా విడుదల కాబోయే ముందు రోజు అంటే జూన్ 3వ తేదీ రాత్రి ప్రదర్శించే ప్రత్యేక ప్రీమియర్ షోల కోసం ఏకంగా రూ. 600 వరకు టికెట్ ధరను పెంచుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక అనుమతిని ఇచ్చింది.
Peddi Movie Ticket Price in TG
పెద్ది సినిమాకు(Peddi Movie Ticket Price) ఉన్న విపరీతమైన క్రేజ్, అడ్వాన్స్ బుకింగ్స్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని నిర్మాతలకు, పంపిణీదారులకు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం వల్ల సామాన్య, మధ్యతరగతి సినిమా ప్రేక్షకుల జేబులకు భారీగా చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా మొదటి వారం రోజుల్లో థియేటర్లలో సినిమా చూడాలనుకునే అభిమానులపై ఈ అదనపు ధరల భారం తీవ్ర ప్రభావం చూపనుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read also Epaper: epaper.vaartha.com
Read also:
నాగచైతన్యకు ఢిల్లీ హైకోర్టులో ఊరట.. ఏఐ డీప్‌ఫేక్ కంటెంట్‌పై సంచలన ఆదేశాలు!

