Peddi Release Update: తెలుగు సినిమా పరిశ్రమలో గత కొన్ని రోజులుగా నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య నలుగుతున్న థియేటర్ల అద్దె, పర్సంటేజ్ వివాదంపై కీలక ముందడుగు పడింది.
మే 15న హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో జరిగిన సమావేశంలో ముఖ్య నేతలందరూ భేటీ అయ్యి ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు, థియేటర్ల పరిస్థితి, భవిష్యత్‌లో తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించారు.
Read Also: Anasuya Bharadwaj First Look: అనసూయ 'నాగబంధం' లుక్ విడుదల.. జూలై 3న థియేటర్లలోకి
There is no problem with the release of Peddi movie.. Dil Raju
Peddi Release Update: పెద్ది’ సినిమా విడుదలపై క్లారిటీ
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు డి. సురేష్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో సుమారు రెండు గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిగాయి. సమావేశం అనంతరం నిర్మాత దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని తెలిపారు. ప్రస్తుతానికి ఎటువంటి హఠాత్తు నిర్ణయాలు తీసుకోకుండా, రాబోయే రెండు నెలల పాటు ఇప్పుడున్న రెంటల్, పర్సంటేజ్ విధానాలనే కొనసాగించాలని నిర్ణయించారు.
ఇక మరో రెండు నెలల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రస్తుతం ఉన్న రెంటల్, పర్సంటేజ్ విధానాలు కొనసాగనున్నాయి. ఈ వ్యవధిలో కమిటీ అన్ని అంశాలను పరిశీలించి నివేదిక ఇవ్వనుంది. ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రామ్‌చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమా జూన్ 4న విడుదల కానుంది. దీంతో సినిమా విడుదలపై వస్తున్న అనుమానాలకు క్లారిటీ వచ్చింది.
Read Also hindi news: hindi.vaartha.com

