Peddi Sudarshan Reddy Death: తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క తీవ్ర దిగ్భ్రాంతిని, ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ప్రజా జీవితంలో, రాజకీయ రంగంలో పెద్ది సుదర్శన్ రెడ్డి అందించిన సేవలు ఎంతో విలువైనవని, వాటిని ఎప్పటికీ మరువలేమని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేసుకున్నారు.
Read Also : TG Intermediate Admissions: ఇంటర్ ప్రవేశాలపై విద్యార్థులకు బిగ్ అలర్ట్
Minister Seethakka shocked by Peddi Sudarshan Reddy’s death.
Peddi Sudarshan Reddy Death: ఉద్యమకారుడిగా మరచిపోలేని సేవలు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సాగిన మలిదశ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి కీలక పాత్ర పోషించారని సీతక్క కొనియాడారు. రాష్ట్ర ఏర్పాటు కోసం ఆయన చేసిన పోరాటాలు, అందించిన సేవలు ఎన్నటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతాయని తెలిపారు. పెద్ది సుదర్శన్ రెడ్డి వంటి అంకితభావం ఉన్న నాయకుని మరణం వరంగల్ జిల్లాతో పాటు ఇటు తెలంగాణ సమాజానికి తీవ్ర బాధాకరమని పేర్కొన్నారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆయన మరణంతో తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ తీరని విషాదాన్ని, కష్ట సమయాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ఆ కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని ఆకాంక్షించారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి మృతిపై సంతాపం తెలిపిన కల్వకుంట్ల కవిత

