Peddi Sudarshan Reddy death: తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి (52) కన్నుమూశారు.
తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడం (పల్మనరీ ఎంబోలిజం) వల్ల గుండె ఆగిపోవడంతో (కార్డియాక్ అరెస్ట్), వైద్యులు దాదాపు ఐదు రోజుల పాటు శ్రమించి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
Read Also : Peddi Sudarshan Reddy Died : ఆప్తమిత్రుడిని కోల్పోయా - కేసీఆర్
Kalvakuntla Kavitha expresses condolences over the death of Peddi Sudarshan Reddy.
Peddi Sudarshan Reddy death కల్వకుంట్ల కవిత సంతాపం
పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం పట్ల బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలంగాణ రాష్ట్రానికి, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు తీరని లోటని పేర్కొన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో సుదర్శన్ రెడ్డితో కలిసి పనిచేసిన రోజులను, మధుర జ్ఞాపకాలను ఈ సందర్భంగా ఆమె గుర్తుచేసుకున్నారు. ఉద్యమకారుడిగా, ప్రజా నాయకుడిగా ఆయన అందించిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, శోకసంద్రంలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సుదర్శన్ రెడ్డి భౌతికకాయాన్ని యశోద ఆస్పత్రి నుంచి నర్సంపేటకు తరలించారు. తన ప్రియతమ నాయకుడిని చివరిసారిగా చూసేందుకు అభిమానులు, పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజలు భారీగా తరలివచ్చారు.

