Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభలో హరీశ్ రావు కన్నీళ్లు

పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభలో హరీశ్ రావు కన్నీళ్లు

వార్త 2 weeks ago

Harish Rao emotional: వరంగల్ జిల్లా నల్లబెల్లిలో నిర్వహించిన దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తన్నీరు హరీశ్ రావు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ కాలంలో పెద్ది సుదర్శన్ రెడ్డితో తనకు ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని, ఆత్మీయ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ హరీశ్ రావు తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీటిపర్యంతమయ్యారు.

Read Also : Papannapet Road Accident: ద్విచక్ర వాహనాలు డి ఒకరు మృతి

 Harish Rao moved to tears at Peddi Sudarshan Reddy’s condolence meeting.

Harish Rao emotional: ప్రాణాలు కాపాడిన మిత్రుడిని చివరిచూపు చూడాల్సి వచ్చిందని ఆవేదన

ఉద్యమ సమయంలో జరిగిన ఒక ఘటనను హరీశ్ రావు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఒక ఉద్యమకారుడి అంతిమ యాత్ర సందర్భంలో పోలీసులతో ఘర్షణ జరిగి, తాను డీసీఎం వాహనం పైనుంచి కిందపడిపోయినప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి వెంటనే స్పందించి తన్ను పట్టుకుని, సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాణాలు కాపాడాడని తెలిపారు. నాడు తనను కాపాడి ఏ ఆస్పత్రికి తీసుకెళ్లాడో, అదే ఆస్పత్రిలో సుదర్శన్ రెడ్డిని చివరి చూపు చూస్తానని కలనైనా ఊహించలేదని హరీశ్ రావు అత్యంత ఆవేదన వ్యక్తం చేశారు.

పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభ.. ఘన నివాళులర్పించిన కేటీఆర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha