Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభ.. ఘన నివాళులర్పించిన కేటీఆర్

పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభ.. ఘన నివాళులర్పించిన కేటీఆర్

వార్త 2 weeks ago

Peddi Sudarshan Reddy Commemorative Meeting: దివంగత నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభ సోమవారం వరంగల్ జిల్లా నర్సంపేటలో ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పెద్ది చిత్రపటానికి పూలమాల వేసి అశ్రునివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన నిలిచి నడిపించిన గొప్ప నాయకుడు పెద్ది అని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా నర్సంపేటలో రాబోయే రోజుల్లో నిర్మించనున్న మెడికల్ కాలేజీకి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెడతామని కేటీఆర్ కీలక ప్రకటన చేశారు.

Read Also : BRS Protest In Narsampet: నర్సంపేటలో బీఆర్‌ఎస్ రాస్తారోకో.. పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ గద్దె కూల్చివేతపై నిరసన

 Peddi Sudarshan Reddy’s memorial meeting… KTR pays rich tributes.

Peddi Sudarshan Reddy Commemorative Meeting: కుటుంబానికి బిఆర్ఎస్ భరోసా

ఎంతకాలం జీవించామన్నది ముఖ్యం కాదు, ఎలా జీవించామన్నదే ప్రధానమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఒకే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ప్రజల గుండెల్లో పెద్ది చెరగని ముద్ర వేశారని, ఆయన అంత్యక్రియలకు వచ్చిన జనసందోహమే దానికి నిదర్శనమని అన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్‌కు సన్నిహితుడిగా ఉంటూ జులై 31న గుండెపోటుతో కన్నుమూసిన సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వారి నివాసానికి వెళ్లి పరామర్శించి, పార్టీ తరఫున రూ. 2.25 కోట్ల ఆర్థిక సహాయం (ఇద్దరు పిల్లలకు చెరో కోటి రూపాయలు, తల్లి సంక్షేమానికి రూ. 25 లక్షలు) అందించినట్లు వివరించారు.

తెలంగాణలో వాహనాల పరీక్షలకు 15 ఆటోమేటెడ్ టెస్టింగ్ సెంటర్లు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha