Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ నటనకు, చిత్ర కథకు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఓవర్సీస్ మార్కెట్‌లో విదేశీ ప్రేక్షకులు చూపిస్తున్న అపూర్వ ఆదరణకు కృతజ్ఞతలు తెలిపేందుకు రామ్ చరణ్ ఒక వినూత్న నిర్ణయం తీసుకున్నారు. తన ‘పెద్ది’ చిత్ర బృందంతో కలిసి ఆయన ప్రత్యేకంగా యూకే (UK) పర్యటనకు వెళ్లనున్నారు.
Read Also : Rajinikanth Dharman movie: కమల్ హాసన్ నిర్మాణంలో రజనీకాంత్ 'ధర్మన్'.. ఫస్ట్ లుక్ విడుదల
Ram Charan to travel to the UK with the ‘Peddi’ team.
Peddi Movie: ఈ నెల 27న హౌన్స్‌లో సినీవరల్డ్‌లో ప్రత్యేక ప్రదర్శన
యూకేలో ఉన్న మెగా అభిమానులను, విదేశీ ప్రేక్షకులను అలరించేందుకు చిత్ర యూనిట్ ఒక స్పెషల్ ఈవెంట్‌ను ప్లాన్ చేసింది. ఈ నెల 27న యూకేలోని హౌన్స్‌లోలో ఉన్న సినీవరల్డ్‌లో ‘పెద్ది’ సినిమా ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ స్పెషల్ స్క్రీనింగ్స్‌కు హీరో రామ్ చరణ్‌తో పాటు చిత్ర బృందం మొత్తం హాజరుకానుంది. ఈ ప్రత్యేక ప్రదర్శనల అనంతరం, అక్కడకు వచ్చే అభిమానులతో, అంతర్జాతీయ ప్రేక్షకులతో రామ్ చరణ్ నేరుగా ముచ్చటించనున్నారు. సినిమాను ఇంత పెద్ద బ్లాక్‌బస్టర్ హిట్ చేసినందుకు వారికి వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలియజేయనున్నారు. యూకేలో ఉన్న భారతీయ సినీ ప్రియులకు మరియు రామ్ చరణ్ అభిమానులకు తమ ఇష్టదైవాన్ని ప్రత్యక్షంగా కలుసుకుని, ఆయనతో మాట్లాడేందుకు ఇదొక సువర్ణ అవకాశంగా నిలవనుంది.
పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లలో నిర్మాత మార్క్
సినిమా థియేటర్లలో విడుదలై అద్భుతమైన కలెక్షన్లతో దూసుకుపోతున్నప్పటికీ, నిర్మాత వెంకట సతీశ్ కిలారు ప్రమోషన్ల విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. సినిమా విడుదలైన తర్వాత కూడా ఇలాంటి అంతర్జాతీయ పర్యటనలు, వినూత్న ప్రచార కార్యక్రమాలను కొనసాగిస్తూ ‘పెద్ది’ సినిమాపై క్రేజ్‌ను నిరంతరం పెంచుతున్నారు. నిర్మాత తీసుకుంటున్న ఈ పబ్లిసిటీ నిర్ణయాలు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
కమల్ హాసన్ నిర్మాణంలో రజనీకాంత్ 'ధర్మన్'.. ఫస్ట్ లుక్ విడుదల

