గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా చిత్రం 'పెద్ది'. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు బుచ్చిబాబు, ఈ చిత్రంలో హీరోయిన్ ఎంపికకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన నిజాన్ని పంచుకున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన నటించడానికి మొదట టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న జాన్వీ కపూర్ కాకుండా, ఆమె చెల్లెలు ఖుషీ కపూర్‌ను కథానాయికగా అనుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో మరియు సినిమా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Read Also ; పెద్ది' ట్రైలర్‌పై చిరంజీవి రివ్యూ.. డైలాగ్ లీక్!

రిజెక్ట్ చేయడానికి గల కారణం చెప్పిన దర్శకుడు బుచ్చిబాబు!
ఈ పాత్రకు ఖుషీ కపూర్ ఎందుకు సెట్ కాలేదనే విషయానికి దర్శకుడు వివరణ ఇస్తూ.. కథ ప్రకారం హీరోయిన్ పాత్ర చాలా మెచ్యూర్డ్‌గా, గ్రామీణ నేపథ్యానికి తగ్గట్టుగా ఉండాలని తెలిపారు. అందుకోసం మొదట ఖుషీ కపూర్‌ను కలిసి మాట్లాడినప్పుడు, ఆమె చూడటానికి చాలా చిన్నపిల్లలా (Too Innocent) కనిపించిందని బుచ్చిబాబు పేర్కొన్నారు. రామ్ చరణ్ సరసన ఆ పాత్రకు ఖుషీ అంతగా సరిపోదని భావించి, ఆ తర్వాత ఆమె సోదరి జాన్వీ కపూర్‌ను సంప్రదించినట్లు చెప్పారు. జాన్వీ కపూర్ ఈ క్యారెక్టర్‌కు పక్కాగా సరిపోతుందని అనిపించడంతో ఆమెను ఫైనల్ చేశామని, దానికి తగ్గట్టుగానే సినిమాలో జాన్వీ లుక్స్, పర్‌ఫార్మెన్స్ అద్భుతంగా రాబోతున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
చెల్లెలి రిజెక్షన్‌పై స్పందించిన జాన్వీ కపూర్.. అసలేం జరిగిందంటే?
అయితే ఈ కథా చర్చల సమయంలో చెల్లెలిని కాదని అక్కను సెలెక్ట్ చేయడంపై ఖుషీ కపూర్ ఏమైనా ఫీల్ అయిందా? అనే ప్రశ్న దర్శకుడికి ఎదురైంది. దీనిపై బుచ్చిబాబు స్పందిస్తూ.. ఇదే విషయాన్ని తాను స్వయంగా జాన్వీ కపూర్‌ను అడిగినట్లు చెప్పారు. “ఈ పాత్రను రిజెక్ట్ చేసినందుకు మీ చెల్లెలు ఖుషీ ఏమైనా బాధపడిందా?” అని అడగ్గా.. జాన్వీ నవ్వుతూ, “అయ్యో! అలాంటిదేమీ లేదు సర్, తను చాలా హ్యాపీగా ఉంది. కథకు ఎవరు సెట్ అవుతారో వారినే కదా తీసుకోవాలి, ఖుషీ కూడా ఆ విషయాన్ని పాజిటివ్‌గానే తీసుకుంది” అని చెప్పినట్లు బుచ్చిబాబు వెల్లడించారు. ఏదేమైనా ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ క్రేజ్‌కు తగ్గట్టుగా, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతంలో వస్తున్న ఈ ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

