Peddi movie update: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'పెద్ది'.
ఈ చిత్రంపై ఇప్పటికే టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మే 18న ఈ చిత్ర అధికారిక ట్రైలర్‌ను విడుదల చేసేందుకు చిత్రబృందం సర్వం సిద్ధం చేసింది. అయితే, ఈ లోపే మెగాస్టార్ చిరంజీవి క్రేజీ రివ్యూ ఇచ్చారు. తనదైన 'చిరులీక్స్' శైలిలో సినిమాలోని ఒక పవర్‌ఫుల్ డైలాగ్‌ను లీక్ చేస్తూ ఆయన చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
Read Also: NTR New Movie Update: ఎన్టీఆర్ బర్త్‌డే ట్రీట్.. మే 19 'NTRNeel' ఫస్ట్ గ్లింప్స్!
Peddi movie update: జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల
'పెద్ది' ట్రైలర్ చూసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. "పెద్ది ట్రైలర్ చూశాను!! జస్ట్… వావ్! 3 నిమిషాల ప్యూర్ ఫైర్‌పవర్ ప్యాక్డ్ ట్రైలర్ ఇది. చరణ్, బుచ్చిబాబు, ఏఆర్ రెహమాన్.. తమ బెస్ట్ అవుట్‌పుట్ ఇచ్చారు. అందరూ కలిసి బాక్సాఫీస్‌ను రఫ్ఫాడించేశారు! ఊహించుకున్నా, దానికి మించి ఈ ట్రైలర్ ఉంటుంది. ఎమోషన్, ఎలివేషన్, మ్యాడ్‌నెస్ అన్నీ ఇందులో నెక్స్ట్ లెవల్‌లో ఉన్నాయి" అంటూ చిత్రయూనిట్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. "చాలా రోజులయ్యింది మీకు #ChiruLeaks ఇచ్చి…" అంటూ సినిమాలో హీరో చెప్పే ఒక పవర్‌ఫుల్ డైలాగ్‌ను బయటపెట్టారు.
"మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు… నేను పోరాడాను సారు…"
ఈ డైలాగ్‌ను లీక్ చేస్తూ.. "సారీ బుచ్చి బాబు… ట్రైలర్ చూశాక కంట్రోల్ తప్పా!"అంటూ సినిమాలోని ఓ పవర్‌ఫుల్ డైలాగ్‌ను లీక్ చేశారు. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. చిరంజీవి ఇచ్చిన ఈ లీక్‌తో ట్రైలర్‌పై అంచనాలు మరింత పెరిగాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వేట.. 'కరుప్పు' మూవీకి కలెక్షన్లు ఎంతంటే?

