Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెళ్లయిన కొద్దిరోజులకే నవవధువు బలవన్మరణం

పెళ్లయిన కొద్దిరోజులకే నవవధువు బలవన్మరణం

వార్త 1 week ago

Kakinada Crime: ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో తీవ్ర కలకలం రేపిన ఒక విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహమై ఎన్నో కవులతో అత్తింటి అడుగుపెట్టిన ఒక నవవధువు, పెళ్లయిన కొద్దిరోజులకే బలవన్మరణానికి పాల్పడింది.

కిర్లంపూడి మండలం గోనేడ గ్రామానికి చెందిన సత్యంశెట్టి వెంకటలక్ష్మి (22) అనే యువతి తన నివాసంలో ఆత్మహత్య చేసుకుంది.

Read Also : Tirupati News: అడవి పంది దాడి.. ముగ్గురికి గాయాలు

 Bride commits suicide just days after wedding

Kakinada Crime: మొదటి రోజే అసలు రంగు బయటపెట్టిన భర్త

వెంకటలక్ష్మికి కోటేశ్వరరావు అనే యువకుడితో ఇటీవలే వివాహమైంది. అయితే, పెళ్లయిన మొదటి రోజే భర్త కోటేశ్వరరావు తన నిజ రూపాన్ని బయటపెట్టాడు. తనకు ఉన్న అక్రమ సంబంధాల గురించి భార్యకు చెప్పడమే కాకుండా, కొన్ని అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలను ఆమెకు పంపించి తీవ్రంగా మానసిక క్షోభకు గురిచేశాడు. భర్త చేసిన ఈ దారుణమైన పనికి ఆ నవవధువు తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది.

అత్తింటి వేధింపులు.. భరించలేక ఆత్మహత్య

భర్త తాగుడుకు బానిస కావడం, అక్రమ సంబంధాలు పెట్టుకోవడమే కాకుండా, అత్తింటివారు కూడా తోడై వెంకటలక్ష్మిని అదనపు వేధింపులకు గురిచేసినట్లు సమాచారం. ఈ క్రూరమైన వేధింపుల గురించి ఆ నవవధువు తన పుట్టింటివారి వద్దకు వచ్చి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ వాపోయింది. భర్త క్రూరత్వం, అత్తింటివారి మానసిక, శారీరక వేధింపులను తట్టుకోలేక, జీవితంపై విరక్తి చెంది ఆమె ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతూ ఆరోపిస్తున్నారు. ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న కిర్లంపూడి పోలీసులు తక్షణమే ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు భర్త కోటేశ్వరరావుతో పాటు అత్తింటివారిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha