Dailyhunt
పెళ్లి బట్టలతోనే ఓటు వేసిన రెండు జంటలు

పెళ్లి బట్టలతోనే ఓటు వేసిన రెండు జంటలు

వార్త 1 week ago

Newlywed couples cast vote Ramanathapuram: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేడు (ఏప్రిల్ 23, 2026) అత్యంత ఉత్సాహంగా సాగుతోంది. రామనాథపురం నియోజకవర్గంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కొత్త జంటలు తమ వివాహం ముగిసిన వెంటనే పోలింగ్ కేంద్రానికి తరలివచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.

Read Also:Tamil Nadu Assembly Elections: పోలింగ్ కేంద్రంలో రోబో సందడి: ఓటర్లకు చాక్లెట్లు పంచుతూ వెరైటీ వెల్‌కమ్

Newlywed couples cast vote Ramanathapuram: ఏం జరిగిందంటే?

గురువారం ఉదయం రామనాథపురంలో పలు వివాహ వేడుకలు జరిగాయి. చినకడై ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబంలో రెండు పెళ్లిళ్లు జరిగాయి.ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం వేలికి ఉన్న సిరా చుక్కను చూపిస్తూ వారు గర్వంగా ఫోటోలకు పోజులిచ్చారు. ఆ తర్వాత మిగిలిన పెళ్లి ఆచారాలను పూర్తి చేసేందుకు తిరిగి కల్యాణ మండపానికి వెళ్లారు.

 Newlywed couples vote Ramanathapuram TN 2026

సిద్ధనాథన్ – షాలిని మరియు జయవీర కార్తీ – శివశంకరి అనే రెండు జంటలు తమ వివాహ క్రతువు ముగిసిన వెంటనే, కనీసం దుస్తులు కూడా మార్చుకోకుండా పెళ్లి బట్టలు మరియు పూలదండలతోనే వెలిపట్నం మున్సిపల్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు.

తమిళనాట త్రిముఖ పోరు

రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ చాలా వేగంగా సాగుతోంది.అధికార డీఎంకే (DMK), ప్రతిపక్ష ఏఐఏడీఎంకే (AIADMK) మరియు నటుడు విజయ్‌కు చెందిన తమిళగ వెట్రి కళగం (TVK) మధ్య బలమైన పోటీ నెలకొంది.ఉదయం 11 గంటల సమయానికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 37.56% పోలింగ్ నమోదైంది.మొత్తం 5.73 కోట్ల మంది ఓటర్లు 4,023 మంది అభ్యర్థుల భవిష్యత్తును తేల్చనున్నారు. ఇందులో 2.93 కోట్ల మంది మహిళలు, 2.83 కోట్ల మంది పురుషులు మరియు 7,728 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

బెంగళూరు ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో ఘోరం.. బిడ్డను చంపి బ్యాగులో కుక్కిన యువతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha