Dailyhunt
పోలింగ్ కేంద్రంలో రోబో సందడి: ఓటర్లకు చాక్లెట్లు పంచుతూ వెరైటీ వెల్‌కమ్

పోలింగ్ కేంద్రంలో రోబో సందడి: ఓటర్లకు చాక్లెట్లు పంచుతూ వెరైటీ వెల్‌కమ్

వార్త 1 week ago

Tamil Nadu Assembly Elections: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వంలో కోయంబత్తూరు ఓటర్లకు ఒక మధురమైన ఆశ్చర్యం ఎదురైంది. కోయంబత్తూరు ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీ పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్లకు 'టినా' అనే రోబో ఘనస్వాగతం పలికి అందరినీ ఆకట్టుకుంది.

Read Also:Trisha Casts Vote Tamil Nadu Elections: క్యూలైన్లో నిలబడి ఓటు వేసిన త్రిష.. యువతకు అదిరిపోయే మెసేజ్

 Tina Robot Coimbatore Election Booth

Tamil Nadu Assembly Elections: రోబో ప్రత్యేకతలు

ఆధునిక సాంకేతికతకు సంప్రదాయాన్ని జోడిస్తూ, ఈ రోబోకు సంప్రదాయ దుస్తులు ధరింపజేయడం విశేషం.పోలింగ్ కేంద్రానికి వచ్చే ఓటర్లకు జాయ్‌స్టిక్ సహాయంతో టినా రోబో, చాక్లెట్లు పంచుతూ సందడి చేసింది. ఇది చూసి ఓటర్లు, ముఖ్యంగా తొలిసారి ఓటు వేస్తున్న యువత మరియు చిన్నారులు ఎంతో ముచ్చటపడ్డారు.ఈ రోబోను అదే కాలేజీకి చెందిన విద్యార్థులు స్వయంగా రూపొందించారు. ఓటర్లలో భయాన్ని పోగొట్టి, నూతన సాంకేతికతపై అవగాహన కల్పించడమే దీని లక్ష్యమని విద్యార్థులు తెలిపారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ముర్షిదాబాద్‌లో బాంబుల మోత.. హుమాయున్ కబీర్ వాహనంపై దాడి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha