Sangareddy Road Accident: తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కొల్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
Srikakulam Road Accident: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్.. దంపతులు దుర్మరణం
వాటర్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన అశోక్ లేలాండ్ వాహనం

ఔటర్ రింగ్ రోడ్డులోని ఎగ్జిట్ వద్ద చెట్లకు నీళ్లు పోస్తున్న వాటర్ ట్యాంకర్‌ను వేగంగా వచ్చిన అశోక్ లేలాండ్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో అశోక్ లేలాండ్ వాహనం డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయి మృతి చెందారు. వాటర్ ట్యాంకర్ వద్ద పని చేస్తున్న వ్యక్తి కూడా ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
Sangareddy Road Accident: కేసు నమోదు చేసిన పోలీసులు
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పటాన్‌చెరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
Epaper: epaper.vaartha.com

