US- Iran War : మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా ముసురుకున్నాయి. గత రెండు రోజులుగా ఇరాన్‌పై అమెరికా జరుపుతున్న భీకర వైమానిక దాడుల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
సిరిక్ ప్రాంతంలోని ఒక పెళ్లి ఇల్లు లక్ష్యంగా అర్ధరాత్రి వేళ జరిగిన బాంబు దాడిలో ఐదుగురు సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వివాహ మహోత్సవంతో సంతోషంగా ఉన్న ప్రాంతంలో ఒక్కసారిగా శవాల దిబ్బగా మారడం స్థానికంగా తీవ్ర అల్లకల్లోలాన్ని సృష్టించింది. ఈ దాడులతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా తెగిపోయి, నేరుగా సైనిక పోరాటానికి దారితీసే పరిస్థితులు ఏర్పడ్డాయి.

అమెరికా బేస్‌లపై ఇరాన్ ప్రతీకార దాడులు: సుప్రీం లీడర్ హెచ్చరిక
పౌరులపై జరిగిన ఈ ఘోర దాడి పట్ల ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ అత్యంత తీవ్రంగా స్పందించారు. అమెరికాకు తమ సాయుధ దళాలు కోలుకోలేని రీతిలో తగిన గుణపాఠం చెప్తాయని ఆయన ఖచ్చితమైన హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే ఈ ప్రతీకార చర్యలలో భాగంగా బహ్రెయిన్, కువైట్, మరియు జోర్డాన్‌లలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను (US Bases) లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణి దాడులను ముమ్మరం చేసింది. ఈ పరిణామాలు గల్ఫ్ ప్రాంతంలో పూర్తి స్థాయి యుద్ధ వాతావరణాన్ని తీసుకురావడమే కాకుండా, అంతర్జాతీయ భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమించాయి.
న్యూయార్క్‌లో కలకలం.. టైమ్స్ స్క్వేర్‌లో కత్తులతో మహిళ దాడి!

