Dailyhunt
పెళ్లికి ముందు విషాదం.. యువకుడి మృతి మిస్టరీ

పెళ్లికి ముందు విషాదం.. యువకుడి మృతి మిస్టరీ

వార్త 2 weeks ago

గురుగ్రామ్‌లో అనుమానాస్పద మృతి

Overdose medicines : గురుగ్రామ్లో 29 ఏళ్ల యువకుడు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం కలకలం రేపింది. అద్దె ఫ్లాట్‌లో నివసిస్తున్న అతను గదిలోనే విగతజీవిగా కనిపించాడు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

మందుల ఓవర్‌డోస్ అనుమానం

పోలీసుల ప్రాథమిక విచారణలో గదిలో పలు మందుల ప్యాకెట్లు, హెల్త్ సప్లిమెంట్స్ లభించాయి. దీంతో శృంగార సామర్థ్యాన్ని పెంచే మందులను అధిక మోతాదులో తీసుకోవడం వల్ల ఈ ఘటన జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మృతుడిని నాగ్‌పూర్‌కు చెందిన రోహిత్ లాల్‌గా గుర్తించారు.

Read Also: Arvind Kejriwal: బీజేపీ, పంజాబ్ ప్రజలకు ద్రోహం చేసిందన్న కేజ్రీవాల్

 Overdose medicines

దర్యాప్తు కొనసాగింపు

మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. స్వాధీనం (Overdose medicines) చేసుకున్న మందులు, నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. నివేదిక వచ్చిన తర్వాతే అసలు కారణం తెలుస్తుందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసుపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ఉక్రుల్ జిల్లాలో ఘర్షణలు.. ముగ్గురు మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha