Dailyhunt
పెళ్లిలో పెను విషాదం.. వరుడిని కాల్చి చంపిన దుండగులు

పెళ్లిలో పెను విషాదం.. వరుడిని కాల్చి చంపిన దుండగులు

వార్త 5 days ago

UP Crime: పెళ్లి బాజాలు మోగాల్సిన వేళ ఆ ఇంట్లో చావు డప్పు వినిపించింది. మరికొన్ని గంటల్లో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాల్సిన వరుడు, ఊరేగింపుగా వెళ్తుండగానే దుండగులు నడిరోడ్డుపై కాల్చి చంపారు.

ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో జరిగిన ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Read Also : Minor Rape Murder Pune:పుణెలో చిన్నారి హత్య ఘటనలో వృద్ధుడి అరెస్ట్!

 Bride’s relative kills groom during wedding procession

UP Crime: నడిరోడ్డుపై కాల్పుల కలకలం

శుక్రవారం సాయంత్రం , బైక్‌పై వచ్చిన ముగ్గురు ముసుగుధారులు ఆజాద్ ప్రయాణిస్తున్న కారును అడ్డగించారు. నంబర్ ప్లేట్ కనిపించకుండా గుడ్డ కట్టి, పక్కా పథకం ప్రకారం వచ్చిన దుండగులు కారుపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలతో రక్తపు మడుగులో ఉన్న ఆజాద్, “నేను బతకలేను” అని చివరి మాటలు పలుకుతూ ప్రాణాలు విడిచాడు. ఆసుపత్రికి తరలించే లోపే అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.

హత్యకు కారణం పెళ్లి ఇష్టం లేకపోవడమే!

పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ హత్య వెనుక ప్రేమ వ్యవహారం లేదా కుటుంబ కలహాలు ఉన్నట్లు తేలింది. వధువు బంధువైన ప్రదీప్ బింద్‌కు ఈ వివాహం ఇష్టం లేదని, అందుకే అతను తన అనుచరులతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడని గుర్తించారు. పెళ్లికి ముందే ప్రదీప్ నుండి బెదిరింపులు వచ్చాయని, అయితే తాము అంతగా పట్టించుకోలేదని మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నిందితుడు ప్రదీప్‌ ఇప్పటికే ఒక హత్య కేసులో బెయిల్‌పై బయట ఉన్నాడని పోలీసులు తెలిపారు.

ప్రస్తుతం ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రదీప్ బింద్‌తో పాటు అతని సహచరులు రవి యాదవ్, భోలే రాజ్‌భర్ పరారీలో ఉన్నారు. వీరి ఆచూకీ తెలిపిన వారికి పోలీసులు రూ. 25,000 నగదు బహుమతిని ప్రకటించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

మటన్ కత్తితో ప్రియుడిని కొట్టి చంపిన వివాహిత! మూటగట్టి ఏం చేసింది?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha