Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెండింగ్ కేసులపై ఏపీ సర్కార్ సీరియస్!

పెండింగ్ కేసులపై ఏపీ సర్కార్ సీరియస్!

వార్త 1 month ago

AP News:ఏపీలో పెండింగ్ క్రమశిక్షణ కేసులు ఎదుర్కొంటున్న ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో క్రమశిక్షణ ఉల్లంఘనల కింద 11,600 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు.

వీటిలో 7,827 పాత కేసులను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఈ కేసుల విచారణను వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ప్రభుత్వ పనితీరును మెరుగుపరచడం ఈ చర్య వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం.

Read also: Telangana Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 5 రోజులు ఈదురు గాలులతో కూడిన వర్షాలు

 AP 11600 employees disciplinary cases

ఏ విభాగాల్లో ఎన్ని కేసులు ఉన్నాయంటే

ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న కేసుల్లో రవాణా, రోడ్లు, భవనాల శాఖలో అత్యధికంగా 1,482 కేసులు ఉన్నాయి. హోం శాఖలో 1,423 కేసులు, రెవెన్యూ శాఖలో 1,226 కేసులు, వైద్య ఆరోగ్య శాఖలో 574 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మిగిలిన కేసులు ఇతర శాఖల్లో విస్తరించి ఉన్నాయి. ఈ కేసులను పర్యవేక్షించడానికి ప్రతి శాఖలో నోడల్ అధికారులను నియమించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ-విజిలెన్స్ వ్యవస్థ ద్వారా ప్రతి కేసును ఆన్‌లైన్‌లో ట్రాక్ చేస్తూ పారదర్శకంగా విచారణ చేపట్టనున్నారు.

AP News:పరిష్కారానికి ప్రభుత్వం నిర్దేశించిన గడువు

ప్రభుత్వం ఈ కేసుల పరిష్కారానికి జులై, ఆగస్టు నెలల్లో పక్కా ప్రణాళిక సిద్ధం చేసింది. జులై 8లోగా నోడల్ అధికారుల నియామకం, జులై 10లోగా ఈ-విజిలెన్స్‌లో కేసుల మ్యాపింగ్ పూర్తి చేయాలి. జులై 17న కలెక్టర్ల స్థాయిలో, 21న శాఖాధిపతులతో, 28న కార్యదర్శులతో సమీక్షలు నిర్వహిస్తారు. చివరిగా ఆగస్టు 4న సీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సమీక్ష జరిగి ఈ కేసులన్నీ కొలిక్కి రానున్నాయి. నిర్దేశిత సమయంలోగా విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి.

Epaper: epaper.vaartha.com

నటుడు ప్రకాశ్ రాజ్‌పై కదిరి పోలీస్ స్టేషన్‌లో బీజేపీ నేతలు ఫిర్యాదు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha