Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 5 రోజులు ఈదురు గాలులతో కూడిన వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 5 రోజులు ఈదురు గాలులతో కూడిన వర్షాలు

వార్త 2 weeks ago

Telangana Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక సమాచారం అందించింది. వాతావరణంలో చోటు చేసుకుంటున్న పలు మార్పుల కారణంగా రాబోయే ఐదు రోజుల పాటు రెండు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు పూర్తిగా తగ్గుముఖం పట్టి, వాతావరణం చల్లబడనుందని అధికారులు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ముఖ్యంగా బలమైన ఈదురు గాలులతో కూడిన వానలు పడే ముప్పు ఉందని అంచనా వేసింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన కొన్ని ప్రత్యేక వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలోని చాలా జిల్లాలలో అక్కడక్కడా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురు గాలులు వీస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 11వ తేదీ వరకు ఈ ఈదురు గాలుల తీవ్రత కొనసాగే అవకాశం ఉంది. బలమైన గాలుల వల్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగులు కూలిపోయే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

Read Also : Andole Voter List Revision: SIR విజయానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి:ఆర్డీవో

 Rain accompanied by gusty winds expected in the Telugu states over the next five days.

Telangana Rain Alert: తెలంగాణలోని ఈ జిల్లాలకు 48 గంటల పాటు ఉరుముల హెచ్చరిక

తెలంగాణ వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో మోస్తరు జల్లులు పడే అవకాశం ఉన్నప్పటికీ, రాబోయే 48 గంటల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ పరిధిలోని ఆదిలాబాద్, కుమరమ్ భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, అలాగే జయశంకర్ భూపాలపల్లి వంటి జిల్లాలలో ఈ వర్షాల ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కొనసాగనున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలలో ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా మంగళవారం శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. శ్రీకాకుళంతో పాటు ఉత్తర కోస్తాలోని విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కూడా వానలు పడే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలలో ఆకాశం మేఘావృతమై ఉండి, అక్కడక్కడా తేలికపాటి చినుకులు పడతాయని విపత్తు నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది.

హైదరాబాద్‌లో మరో కొత్త ఫ్లైఓవర్.. అక్కడ ఇక నో ట్రాఫిక్ జామ్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha