Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రియుడితో కలిసి భర్తను చంపి.. ఆపై ఏం చేసిందంటే?

ప్రియుడితో కలిసి భర్తను చంపి.. ఆపై ఏం చేసిందంటే?

వార్త 5 days ago

Chennai Crime: తమిళనాడు రాజధాని చెన్నైలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. వివాహేతర సంబంధం, కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తను అత్యంత క్రూరంగా హత్య చేసింది.

అంతటితో ఆగకుండా, పాపాన్ని దాచేందుకు భర్త శవాన్ని ముక్కలుగా నరికి ఒక సూట్‌కేస్‌లో కుక్కింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Read also: Most Valuable Celebrities in India : ఇండియాలో అత్యంత విలువైన సెలబ్రిటీలు వీరే..

 Wife chops husband into pieces with lover and hides the body in a suitcase.

Chennai Crime: రైల్వే స్టేషన్‌లో దొరికిన సూట్‌కేస్

పెరంబూర్‌ రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫారమ్‌పై అనుమానాస్పదంగా ఉన్న ఒక సూట్‌కేసును స్థానికులు గమనించారు. దాన్ని తెరిచి చూడగా అందులో తల, చేతులు, కాళ్లు లేని ఒక వ్యక్తి మృతదేహం కనిపించడంతో వారు తీవ్ర దిగ్భ్రాంతికి గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఈ హత్య కేసును ఛేదించేందుకు పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అయితే, మృతదేహంపై ఉన్న బ్రాండెడ్‌ బట్టల బార్‌కోడ్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు, దాని ఆధారంగా సాంకేతిక దర్యాప్తును ముమ్మరం చేశారు. ఆ బట్టలు కొనుగోలు చేసిన వివరాలు, నిందితుల మొబైల్ లోకేషన్‌ ఆధారంగా వారు ప్రస్తుతం తేనాంపేట, టి.నగర్‌ పరిసరాలలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha