Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెన్షన్ కట్ అయిందని బెంగతో వృద్ధురాలు మృతి!

పెన్షన్ కట్ అయిందని బెంగతో వృద్ధురాలు మృతి!

వార్త 1 month ago

Medak: మే 1.. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్.. రేషన్ బియ్యం తో కాలం వెళ్ళబోతున్న వృద్ధురాలికి అధికారులు పెన్షన్ కట్ చేయడంతో బెంగతో మృతి చెందిన సంఘటన మండల కేంద్రమైన అల్లాదుర్గంలో చోటుచేసుకుంది.

కుటుంబీకుల, స్థానికుల కథనం ప్రకారం అల్లాదుర్గం గ్రామానికి చెందిన తుపాకుల సంగమ్మ (78)సంవత్సరాలు భర్త ఎప్పుడో మరణించాడు, ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ పై ఆధారపడి జీవిస్తుంది. ఎన్నో ఏండ్లుగా పెన్షన్ పొందుతున్న మూడు నెలలు సరిగా పెన్షన్ తీసుకోవడం లేదని సాకుతో అధికారులు లబ్ధిదారుల జాబితా నుండి తొలగించారు.

Read Also: Shamshabad Accident: ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఆరుగురు దుర్మరణం!

Medak: అధికారుల వైఖరిపై ఆగ్రహం

కుమార్తె పటాన్చెరులో నివాసం ఉంటుండడంతో మృతురాలు అక్కడే ఉంటుంది. పెన్షన్ డబ్బుల కోసం గత మూడు నెలలుగా తిరుగుతున్న, పెన్షన్ సిబ్బంది సరైన టైంలో డబ్బులు ఇవ్వకపోవడంతో ఆమె పెన్షన్ కట్ చేశారు. దీంతో మెదక్ జిల్లా సంబంధిత శాఖ కార్యాలయంలో పలుమార్లు వినతి పత్రం అందజేసిన, పెన్షన్ రావడంలేదని బెంగతో మృతురాలు మృతి చెందారని సంబంధిత అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణమని కుటుంబీకులు తెలిపారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య కేసులో కీలక మలుపు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha