Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఆరుగురు దుర్మరణం!

ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఆరుగురు దుర్మరణం!

వార్త 1 month ago

Shamshabad Accident: హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ వద్ద అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఒక కారు అతివేగంతో వచ్చి బలంగా ఢీకొట్టింది.

ఈ భీకర ప్రమాద ధాటికి కారులో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులో ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో అతని పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు సమాచారం.

Read Also: AP student suicide in Chicago: అమెరికాలో కర్నూలు విద్యార్థి ఆత్మహత్య.. కారణం ఇదే!

 Shamshabad Accident: Car hits parked lorry.. six killed!

ప్రమాదం జరిగిన తీరు చూస్తుంటే అది ఎంత భీభత్సంగా జరిగిందో అర్థమవుతోంది. ఢీకొన్న వేగానికి కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయి లారీ కిందకు దూసుకుపోయింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని మెరుగైన చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదానికి అతివేగమే ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని కారు డ్రైవర్ గమనించకపోవడం వల్లే ఈ ఘోరం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతులు ఎక్కడి వారు? ఎక్కడికి వెళ్తున్నారు? అనే వివరాలను సేకరిస్తున్నారు. శంషాబాద్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ముంబై పుచ్చకాయ మరణాలు.. ఫోరెన్సిక్ నివేదికలో సంచలన విషయాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha