Penuganchiprolu Attack : ఎన్టీఆర్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెనుగంచిప్రోలులో ఆదివారం నాడు అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దైవ దర్శనం కోసం బాపట్ల జిల్లా కొల్లూరు గ్రామం నుండి వచ్చిన దాదాపు 20 మంది భక్తుల బృందంపై స్థానికులు కొందరు కత్తులు, కర్రలతో ఘోరంగా దాడికి తెగబడ్డారు.
పండుగ వాతావరణం ఉండాల్సిన ఆలయ పరిసర ప్రాంతం ఒక్కసారిగా రక్తసిక్తంగా మారి యుద్ధ వాతావరణాన్ని తలపించింది. భక్తుల బృందం అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు తమ వెంట తెచ్చుకున్న మేకపోతును కోసే విషయమై స్థానికులతో మాట్లాడారు. ఇందుకు గాను కూలి కింద రూ. 600 ఇస్తామని ముందుగానే ఒప్పందం కుదిరింది. అయితే, మేకపోతును కోసిన తర్వాత స్థానికులు మాట మార్చి, ఒప్పందం కంటే ఎక్కువ డబ్బులు ఇవ్వాలంటూ మొండికేసి డిమాండ్ చేశారు. అన్యాయంగా అడిగితే ఇవ్వలేమని భక్తులు నిరాకరించడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం రేగింది.
Read Also: Seethanagaram news: మన్యం అడవుల్లో పెద్దపులి సంచారం కలకలం
Penuganchiprolu Attack
Penuganchiprolu Attack :వృద్ధులు, మహిళలని చూడకుండా వేటాడి మరీ వేటు
ఈ చిన్న ఆర్థిక వివాదం కాస్తా క్షణాల్లోనే భయానక భౌతిక దాడిగా మారింది. స్థానికులంతా ఒక్కటయ్యి కత్తులు, పెద్దపెద్ద కర్రలు చేతబూని భక్తులపై విరుచుకుపడ్డారు. మున్నేరు నదికి ఆవలి వైపు ఉన్న వైఎన్‌ఆర్ మామిడి తోటలో వంటావార్పు చేసుకుంటున్న భక్తులపై దాడి జరగడంతో, ప్రాణాలు దక్కించుకునేందుకు మహిళలు, చిన్నారులు, వృద్ధులు అరుపులు పెడుతూ పరుగులు తీశారు. దుండగులు పారిపోతున్న భక్తులను వెంబడించి మరీ వేటాడి కత్తులతో దాడులు చేశారు. నెత్తురోడిన తోట ఈ కిరాతక దాడిలో ఐదుగురు భక్తులు తీవ్రంగా గాయపడి నెత్తురోడారు. గాయపడిన వారిలో గూడపాటి ఆంజనేయులు, పోలంకి శ్రీనివాసరావు, శ్రీపతి నాగరాజులతో పాటు మరో ఇద్దరు ఉన్నారు. అలాగే దాడికి పాల్పడిన స్థానికులలో ముంగి జంపన్న అనే వ్యక్తికి కూడా గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పెనుగంచిప్రోలు ఎస్ఐ అర్జున్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిని వెంటనే పెనుగంచిప్రోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

