Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెరిగిన బంగారం ధరలు

పెరిగిన బంగారం ధరలు

వార్త 3 weeks ago

Gold Rates Today: భారతదేశంలో పసిడికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పండుగలు, శుభకార్యాలు, పెళ్లిళ్లు ఏవైనా సరే బంగారం కొనుగోలు చేయడం మన సంప్రదాయంలో భాగం.

అయితే గడిచిన రెండేళ్లుగా సామాన్యులకు పసిడి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.

నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు

గతంతో పోలిస్తే పసిడి ధరలు రికార్డు స్థాయిలోనే కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతూ లక్షన్నర సమీపంలో ఊగిసలాడుతున్నాయి. నేడు దేశవ్యాప్తంగా వివిధ ప్రధాన నగరాల్లో 24 క్యారెట్లు, 22 క్యారెట్ల బంగారం అలాగే వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.

Gold Rates Today: ప్రముఖ నగరాల్లో పసిడి, వెండి ధరల జాబితా

  • హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం: 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,340 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,32,310గా ఉంది. కేజీ వెండి ధర రూ.2,34,900 వద్ద కొనసాగుతోంది.
  • చెన్నై: 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములు రూ.1,44,340, 22 క్యారెట్లు రూ.1,32,310గా ఉంది. కిలో వెండి ధర రూ.2,34,900గా ఉంది.
  • ఢిల్లీ: దేశ రాజధానిలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,44,490, 22 క్యారెట్లు రూ.1,32,460గా పలుకుతోంది. వెండి కిలో ధర రూ.2,34,900గా ఉంది.
  • ముంబై, బెంగళూరు: ఈ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,44,340, 22 క్యారెట్లు రూ.1,32,310గా ఉంది. కేజీ వెండి ధర రూ.2,34,900గా ఉంది.
  • కోల్‌కతా: 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,44,340, 22 క్యారెట్ల ధర రూ.1,32,310గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ.2,35,100లుగా ఉంది.

యూపీఐ పేమెంట్లలో కీలక మార్పులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha