Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెరిగిన టమాటా ధరలు.. కేంద్రం సబ్సిడీ ప్రకటన!

పెరిగిన టమాటా ధరలు.. కేంద్రం సబ్సిడీ ప్రకటన!

వార్త 1 week ago

Tomato Prices:టమాటా ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. దేశవ్యాప్తంగా టమాటా రేట్లు పెరిగి సామాన్యులు ఇబ్బందులు పడుతున్న వేళ ప్రభుత్వం రంగంలోకి దిగింది.

వినియోగదారుల వ్యవహారాల శాఖ నేరుగా జోక్యం చేసుకుని ధరలను తగ్గించే ప్రయత్నం చేస్తోంది. త్వరలోనే తక్కువ ధరకే నాణ్యమైన టమాటాలను మార్కెట్లోకి తీసుకురానుంది.

Read also: UP news: యూపీలో వింత ఘటన.. 11,000 వోల్ట్ల కరెంట్ తీగలపైనే నిద్రపోయిన తాగుబోతు!

 Centre’s measures to control tomato prices

తక్కువ ధరకే టమాటాల అమ్మకాలు

ప్రభుత్వం ఎన్.సి.సి.ఎఫ్ ద్వారా కిలో టమాటాలను 35 రూపాయల నుంచి 45 రూపాయలకే విక్రయించనుంది. ఈ నిర్ణయం వల్ల మార్కెట్ ధర కంటే తక్కువకే ప్రజలకు సరుకు అందుతుంది. మొదట ఢిల్లీ-ఎన్.సి.ఆర్ మరియు ముంబై నగరాల్లో ఈ అమ్మకాలు మొదలవుతాయి. అక్కడి పరిస్థితులను బట్టి దేశంలోని మిగిలిన ప్రధాన నగరాలకు కూడా ఈ సదుపాయాన్ని విస్తరిస్తారు.

Tomato Prices:ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు

కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల పంట దెబ్బతిన్నది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా దిగుబడి తగ్గింది మరియు రవాణా ఖర్చులు పెరిగాయి. గతేడాది ఇదే సమయంలో 34.43 రూపాయలు ఉన్న ధర ఇప్పుడు రెట్టింపు అయ్యింది. ఈ సరఫరా సమస్యలను అధిగమించడానికి ప్రభుత్వం కొత్త ప్రణాళికలను అమలు చేస్తోంది.

Epaper: epaper.vaartha.com

ప్రజారోగ్యాన్ని మింగేస్తున్న కల్తీ మాఫియా!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha