Adulteration mafia : నిత్యం మనం తీసుకునే ఆహారం అమృతం కావాలి, కానీ నేడు అది నెమ్మదిగా ప్రాణాలను హరించే విషం గా మారుతోంది. లాభాపేక్ష అనే రాక్షసి కోరల్లో చిక్కు కున్న ఆహార రంగం, సామాన్యుడి ఆరోగ్యంతో చెలగాట మాడుతోంది.
‘సర్వం కల్తీమయం’ అన్నది కేవలం ఒక నానుడి కాదు, నేడు అది మన కళ్లముందు కదలాడుతున్న భయంకర వాస్తవం. భారతదేశంలో సామాన్య ప్రజలజీవన ప్రమాణాలు పెరగడం అటుంచితే, కనీస ఆరోగ్య భద్రత కరువవ్వడం ఆందోళన కలిగించే అంశం. వాతావరణ కాలు ష్యం ఒకవైపు ఊపిరితిత్తులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, మరో వైపు మనం తినేఆహారంలో చేరుతున్న రసాయనాలు నిశ్శ బ్దంగా మృత్యువును ఆహ్వానిస్తున్నాయి. ఉదయం నిద్రలేచిన దగ్గరి నుండి వాడే టూత్పేస్ట్, పాలు, టీ పొడి, వంట నూనె, పప్పు ధాన్యాలు.. ఇలా ఒకటేమిటి, ఏ వస్తువును తాకినా అందులో కల్తీ ఉందన్న వార్తలు వినియోగదారుడి వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. గతంలో కల్తీ అంటేఏదో ఒక వస్తువులో తక్కువ నాణ్యత గల పదార్థాలను కలపడం అని అనుకునేవారు. కానీ నేడు అది ఒక వ్యవస్థీకృత నేరంగా రూపాంతరం చెందింది.

Adulteration mafia
Adulteration mafia : మానవత్వం లేని చర్య
ఇటీవల దేశవ్యాప్తంగా జరి గిన దాడులు చూస్తుంటే, ఒక భారీ నెట్వర్క్ దీని వెనుక ఉన్నట్లు అర్థమవుతోంది. సూరత్ వంటి నగరాల్లో యూరి యా, డిటర్జెంట్, ప్రాణాంతక రసాయనాలతో సెంథటిక్ పాలు’ తయారు చేయడం మానవత్వం లేని చర్య. పన్నీర్, నెయ్యిలో జంతువుల కొవ్వును కలపడం వంటి ఘటనలు ఆధ్యాత్మిక భావనలతో పాటు ఆరోగ్య భద్రతను కూడా దె బ్బతీస్తున్నాయి. ఢిల్లీలో వెలుగులోకి వచ్చిన నకిలీ టూత్ పేస్ట్ తయారీ కేంద్రం మనదైనందిన జీవితంలో ఏవస్తువు నూ నమ్మలేమని నిరూపించింది. బ్రాండెడ్ కంపెనీల పేర్ల తో నకిలీ ప్యాకింగ్ చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. గడువు ముగిసిన సాఫ్ట్ డ్రింక్స్, ప్యాక్డ్ ఫుడ్స్పై పాత తేదీ లను చెరిపివేసి కొత్తతేదీలు ముద్రించడం ద్వారా వినియోగదారుల పాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రస్తుత ఆధు నిక సమాజంలో నగర జీవనం చాలా వేగంగా మారిపో యింది. ఉరుకులు పరుగుల జీవితంలో సొంతంగా వంట చేసుకునే తీరికలేక చాలామంది బయటి ఆహారంపై ఆధార పడుతున్నారు. బిర్యానీ సెంటర్లు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ అవుట్ లెట్లు నేడు ప్రతిగల్లీలోనూ దర్శనమిస్తున్నాయి. అయితే, ఈ కేంద్రాల్లో శుభ్రత అనేది మచ్చుకైనా కనిపిం చడం లేదు.

Adulteration mafia
వ్యక్తిగత సమస్య కాదు
హైదరాబాద్ వంటి నగరాల్లో వెలుగులోకివచ్చి న అల్లంవెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రాల పరిస్థితి దారుణం. కుళ్ళిన అల్లం, వెల్లుల్లికి రంగులు, రసాయనాలు కలిపి ఆకర్షణీయమైన ప్యాకింగ్తో హోటళ్లకు సరఫరాచేస్తున్నారు. ఇలాంటి పదార్థాలను వాడటం వల్ల హోటల్ ఆహారం రుచి కరంగా ఉన్నట్లు అనిపించినా, ఆది లోలోపల అవ యవాలను చిత్తు చేస్తోంది. కల్తీ ఆహారం అనేది కేవలం ఒక వ్యక్తిగత సమస్య కాదు, ఇది దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రజారోగ్య సంక్షోభం. కల్తీ వల్ల కలిగే నష్టాలు తక్షణమే బయటపడవు, కానీ దీర్ఘకాలంలో అవి ప్రాణాంత కమవుతాయి. ఆహారభద్రతా ప్రమాణాలను పర్యవేక్షించాల్సి న ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’, ఆరోగ్యశాఖలు క్షేత్రస్థాయిలో విఫలమవుతున్నాయని చెప్పక తప్పదు. తనిఖీలు కేవలం పండుగ సీజన్లకు లేదా ఫిర్యాదు లు వచ్చినప్పుడు మాత్రమే పరిమితం కాకూడదు. ప్రభు త్వం ఎన్నిచట్టాలు చేసినా, ప్రజల్లో చైతన్యం లేనిదే మార్పు రాదు. ఏదైనా వస్తువు కొనేముందు ఎక్స్ పైరీ డేట్, తయారీ దారు వివరాలు, ఎఫ్. ఎస్.ఎన్.ఏ.ఐ లోగోను తప్పనిసరి గా చూడాలి. మనం ఇప్పుడే మేల్కోక పోతే, రేపటితరం అనారోగ్యకరమైన సమాజంలో బతకాల్సి వస్తుంది.
-వనకల్ల వీరప్ప
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com

