Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెరుగుతున్న ఎండలు.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు!

పెరుగుతున్న ఎండలు.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు!

వార్త 2 weeks ago

Narendra Modi: దేశవ్యాప్తంగా భానుడి భగభగలు నానాటికీ తీవ్రరూపం దాల్చుతున్నాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో జనం అల్లాడిపోతున్న తరుణంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు.

తీవ్రమైన వడగాల్పుల (Heat Waves) నేపథ్యంలో దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పీఎం మోదీ కొన్ని కీలక సూచనలు చేశారు.

 imd weather alert

Read also: Siddaramaiah's resignation: కర్ణాటకలో పొలిటికల్ హీట్: రేపు సిద్ధరామయ్య రాజీనామా? మే 30న కొత్త సీఎం ప్రమాణ స్వీకారం!

పీఎం మోదీ సూచించిన జాగ్రత్తలు :

తీవ్రమైన వేడి నుంచి ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రధాని పలు సూచనలు చేశారు.

ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రధాని సూచించారు. శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉండేందుకు నిత్యం తగినంత మొత్తంలో మంచి నీరు లేదా ద్రవ పదార్థాలను తీసుకోవాలి. అధిక ఉష్ణోగ్రతల ప్రభావం పిల్లలు, వృద్ధులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే రైతులు, శ్రామికులపై ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వృద్ధుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఈ కష్టకాలంలో ఇతరులకు వీలైనంత సహాయం చేయడంతో పాటు, మీ ఇళ్లు, వ్యాపార సముదాయాల ఆరుబయట పక్షులు, మూగజీవాల కోసం తాగునీటిని ఏర్పాటు చేయాలని కోరారు.

Narendra Modi: వడదెబ్బ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!

శరీరంలో నీరసం, తల తిరగడం, వికారం (వాంతులు వచ్చేలా ఉండడం), తీవ్రమైన అలసట వంటివి వడదెబ్బ (Sunstroke) యొక్క ప్రాథమిక లక్షణాలు. వీటిని ఏమాత్రం తేలికగా తీసుకోకూడదని ప్రధాని స్పష్టం చేశారు. ఒకవేళ మీ చుట్టుపక్కల ఎవరైనా అకస్మాత్తుగా స్పృహ కోల్పోయినా లేదా తీవ్ర అస్వస్థతకు గురైనా.. వెంటనే వారిని నీడ ఉన్న చల్లని ప్రదేశానికి తరలించాలి. ఇలాంటి సమయాల్లో సమయస్ఫూర్తితో అప్రమత్తంగా వ్యవహరిస్తే ఒకరి ప్రాణాన్ని కాపాడిన వారమవుతామని మోదీ పేర్కొన్నారు.

పలు రాష్ట్రాల్లో వడగాల్పుల తీవ్రత.. త్వరలోనే ఉపశమనం!

వాతావరణ శాఖ (IMD) నివేదికల ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్ (Delhi-NCR) పరిసర ప్రాంతాల్లో రాబోయే రోజుల్లో వడగాల్పులు మరింత తీవ్రం కానున్నాయి. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరం, విదర్భ, ఛత్తీస్‌గఢ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, బీహార్, ఒడిశా వంటి పలు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మే 29వ తేదీ నుంచి ఢిల్లీ మరియు దాని పరిసర ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీనివల్ల ఉష్ణోగ్రతలు కాస్త తగ్గి ప్రజలకు ఉపశమనం లభిస్తుందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

రూ.50 వేల కోసం భార్యను స్నేహితులకు అమ్మేసిన భర్త!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha