Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రూ.50 వేల కోసం భార్యను స్నేహితులకు అమ్మేసిన భర్త!

రూ.50 వేల కోసం భార్యను స్నేహితులకు అమ్మేసిన భర్త!

వార్త 2 weeks ago

Gujarat Crime: డబ్బు వ్యామోహంతో కట్టుకున్న భార్యనే ఓ నరరూప రాక్షసుడు తన స్నేహితులకు విక్రయించిన అమానుష ఘటన గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో వెలుగులోకి వచ్చింది.

కేవలం రూ. 50 వేల కోసం భార్యను అమ్మేసిన ఆ భర్త.. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేసి నాటకమాడాడు. మే 11న తన భార్య అకస్మాత్తుగా కనిపించడం లేదంటూ స్థానిక పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశాడు. కేసు పెట్టిన కొద్దిరోజులకే సదరు భర్త కూడా పరారు కావడంతో పోలీసులకు అనుమానం వచ్చి లోతుగా దర్యాప్తు ప్రారంభించగా ఈ ఘోరం బయటపడింది.

Read Also:secunderabad crime: చికిత్స పొందుతూ తప్పంచుకున్న రిమాండ్ ఖైదీ

సామూహిక అత్యాచారం.. నగలు దోపిడీ

 Seven Arrested in Banaskantha.

పోలీసుల విచారణలో దిగ్భ్రాంతి కలిగించే నిజాలు వెల్లడయ్యాయి. భర్త చేతిలో అమ్ముడుపోయిన బాధితురాలిని కొనుగోలు చేసిన నిందితులు, ఆమెను ఒక రహస్య ప్రాంతానికి తరలించారు. అక్కడ ఆమెపై నిందితులంతా కలిసి సుదీర్ఘంగా సామూహిక అత్యాచారానికి (Gangrape) పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా బాధితురాలి ఒంటిపై ఉన్న బంగారు నగలను సైతం బలవంతంగా దోచుకున్నారు. ఈ అమానవీయ ఘటనపై బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Gujarat Crime: భర్త సహా ఏడుగురు నిందితుల అరెస్ట్

ఈ ఘోరానికి సంబంధించి గుజరాత్ పోలీసులు పక్కా ప్లాన్‌తో దాడి చేసి.. పరారీలో ఉన్న నిందితుడైన భర్తతో పాటు, ఈ దారుణానికి సహకరించి మహిళపై అత్యాచారానికి ఒడిగట్టిన మిగతా ఆరుగురు స్నేహితులను గుట్టుచప్పుడు కాకుండా అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి, వారిపై కిడ్నాప్, గ్యాంగ్‌రేప్, దోపిడీ తదితర తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

బీమా డబ్బు కోసం భర్తను హత్య చేయించిన భార్య

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha