Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెరుగుతున్న వడగాడ్పులు.. నంద్యాల జిల్లా సంజామలలో 43.3° నమోదు

పెరుగుతున్న వడగాడ్పులు.. నంద్యాల జిల్లా సంజామలలో 43.3° నమోదు

వార్త 1 week ago

AP Heat Wave: రాష్ట్రంలో పెరుగుతున్న ఎండ తీవ్రత, వడగాలులు మరోవైపు ఉరుములతో కూడిన పిడుగుపాటు వర్షాలు పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు.

గురువారం నంద్యాల జిల్లా సంజామలలో 43.3 డిగ్రీలు నమోదైందని తెలిపారు. అలాగే 28 జిల్లాలకు గాను 17 జిల్లాల పరిధిలోని 126 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు ఆయన వెల్లడించారు. శుక్రవారం రాష్ట్రంలో 43.44 డిగ్రీలు మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యేందుకు అవకాశం ఉందన్నారు. రేపు వడగాలులు వీచే అవకాశం ఉన్న మండలాలు అల్లూరి జిల్లా జికే వీధి మండలం, పోలవరం జిల్లా చింతూరు, గంగవరం, కూనవరం రంపచోడ వరం.

Read also: Southwest: రైతులకు గుడ్ న్యూస్.. ముందుగానే 'నైరుతి'

 Rising temperatures in AP

AP Heat Wave: భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

కోనసీమ జిల్లా ఆత్రేయపురం, తూర్పుగోదావరి జిల్లా చాగల్లు, గోకవరం, కోరుకొండ, కొవ్వూరు, రాజమహేంద్రవరం అర్బన్, రూరల్, రాజానగరం, సీతానగరం, తాళ్లపూడి, ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, అనంతపురం జిల్లా, అనంతపురం రూరల్, బుక్కరాయ సముద్రం మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. శనివారం 26 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరోవైపు నైరుతి, ఆనుకొని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అల్పపీడన కేంద్రం నుండి, తమిళనాడు, రాయలసీమ, కర్ణాటక మీదుగా మహారాష్ట్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని ఏపీఎన్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

వడగాడ్పుల హెచ్చరికలు

దీని ప్రభావంతో శుక్రవారం అల్లూరి, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో వర్షం పడేటప్పుడు పొలాల్లో పనిచేసే రైతులు, పశుకాపరులు చెట్ల క్రింద నిలబడరాదని వెంటనే సురక్షిత భవనాల్లోకి వెళ్లాలని సూచించారు. గురువారం నంద్యాల సంజామలలో 43.4 డిగ్రీలు కర్నూలు, కౌతాళంలో 42.9 డిగ్రీలు, అనంతపురం తెరన్నపల్లిలో 42.8 డిగ్రీలు.

ఉరుములు పిడుగులతో కూడిన వర్షాలు

చిత్తూరు రాయలపేట వైఎస్సార్ కడప జమ్మలమడుగులో 42.2 డిగ్రీలు, ప్రకాశం కొప్పెరపాడులో 42 డిగ్రీలు, మార్కాపురం కంభంలో 41.9 డిగ్రీలు, మన్యం పాచిపెంటలో 41.4 డిగ్రీలు, పల్నాడు గురజాల, శ్రీసత్యసాయి దాడితోటలో 41.3 డిగ్రీలు, విజయనగరం రామభద్రాపురంలో 41.2 డిగ్రీలు నెల్లూరు కొమ్మిపాడులో 41 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బిపి ఉన్నవారు ఎండలో తిరగరాదని, నిమ్మకాయ నీరు, మజ్జిగ కొబ్బరినీరు, మంచినీరు, ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha