Fuel Price Hike: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వ్యవహారం మరోసారి రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం తాజాగా లీటరుకు రూ.
3 చొప్పున ధరలను పెంచడంపై తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అనాలోచిత నిర్ణయం సామాన్యుల నడ్డి విరుస్తుందని మండిపడుతూ ఆయన శనివారం కేంద్ర ప్రభుత్వానికి ఒక ఘాటైన లేఖ రాశారు.
Read Also:Sanatana Dharma : సనాతనం అంటే పురాతనం- రజినీ కామెంట్స్ వైరల్
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ విధంగా ధరలు పెంచడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని సీఎం విజయ్ స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ధరలను అదుపులో ఉంచి, ఓటింగ్ ప్రక్రియ పూర్తి కాగానే ప్రజలపై ఈ అదనపు భారాన్ని మోపడం కచ్చితంగా అన్యాయమని ఆయన విమర్శించారు.
చమురు సంస్థల తీరుపై ధ్వజమెత్తిన విజయ్
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు (Crude Oil) ధరలు తగ్గినప్పుడు ఆ ప్రయోజనాన్ని సామాన్య ప్రజలకు బదిలీ చేయడంలో చమురు కంపెనీలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు.అంతర్జాతీయంగా రేట్లు తగ్గినప్పుడు ఇక్కడ ధరలు తగ్గించకుండా కేవలం భారీ లాభాలు గడించడానికే కంపెనీలు ప్రాధాన్యత ఇస్తున్నాయని, తీరా సమయం చూసి సామాన్యుడిపై భారం వేస్తున్నారని ధ్వజమెత్తారు.
TN CM Joseph Vijay Fuel Price Letter
Fuel Price Hike: సమాజంలోని అన్ని వర్గాలపై ప్రభావం
ఇంధన ధరల పెరుగుదల వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులను సీఎం విజయ్ తన లేఖలో సుదీర్ఘంగా ప్రస్తావించారు.ఈ పెంపు వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాల నెలవారీ ఖర్చులు భారీగా పెరుగుతాయని, ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు ఉపయోగించే ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు.వాహనాలపై లోన్లు తీసుకుని, నెలనెలా ఈఎంఐలు (EMIs) చెల్లించుకుంటూ జీవనం సాగిస్తున్న క్యాబ్ ఆపరేటర్ల ఆర్థిక పరిస్థితి ఈ నిర్ణయంతో మరింత దిగజారుతుందన్నారు.
మార్కెట్ మందగమనం, ఎగుమతుల తగ్గుదల వంటి సమస్యలతో ఇప్పటికే సతమతమవుతున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమల (MSMEs) ఉత్పత్తి వ్యయం ఈ పెంపుతో మరింత పెరుగుతుందని.. ఫలితంగా ఆ పరిశ్రమలు మూతపడే ప్రమాదం ఉందని విజయ్ ఆందోళన వ్యక్తం చేశారు.పెంచిన ఇంధన ధరలను తక్షణమే, ఎలాంటి ఆలస్యం లేకుండా వెనక్కి తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వం తరపున సీఎం విజయ్ కేంద్రానికి డిమాండ్ చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

