Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెట్రోల్ బంక్‌లో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు!

పెట్రోల్ బంక్‌లో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు!

వార్త 3 weeks ago

Shadnagar Petrol Bunk: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలో శుక్రవారం భారీ ప్రమాదం తృటిలో తప్పింది. పట్టణంలోని బైపాస్ రోడ్డులో ఉన్న యమ్మీ హోటల్ సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో ప్రమాదవశాత్తు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

ఇంధనం నింపే ప్రధాన కేంద్రం కావడంతో ఒక్కసారిగా మంటలు లేవడం చూసి బంక్‌కు వచ్చిన వాహనదారులు, స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

Read Also: TG government schemes: పత్తి రైతులకు గుడ్ న్యూస్.. 19 జిల్లాల్లో ఉచితంగా విత్తనాల పంపిణీ.

Shadnagar Petrol Bunk: బంక్ సిబ్బంది సమయస్ఫూర్తి.. అదుపులోకి మంటలు

మంటలు వ్యాపిస్తున్న క్రమంలో పెట్రోల్ బంక్ సిబ్బంది అత్యంత అప్రమత్తంగా, సమయస్ఫూర్తితో స్పందించారు. ఏమాత్రం పరుగు తీయకుండా బంక్ ప్రాంగణంలో అందుబాటులో ఉంచిన అగ్నిమాపక పరికరాలను (ఫైర్ ఎక్స్‌టింగూషర్స్) తక్షణమే రంగంలోకి దించారు. మంటలు పెట్రోల్ ట్యాంకర్ల వైపు వెళ్లకుండా చాకచక్యంగా వ్యవహరించి, క్షణాల వ్యవధిలోనే వాటిని పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. సిబ్బంది సరైన సమయంలో స్పందించకపోతే చుట్టుపక్కల ప్రాంతాలకు భారీ నష్టం వాటిల్లేదని స్థానికులు పేర్కొన్నారు.

అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే స్థానిక అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సిబ్బంది ప్రదర్శించిన సమయస్ఫూర్తిని, ధైర్యాన్ని అధికారులు అభినందించారు. పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా? లేదా మరేదైనా సాంకేతిక లోపం ఉందా? అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. బంక్‌లోని భద్రతా ప్రమాణాలను పరిశీలిస్తున్నారు.

Epaper: epaper.vaartha.com

తెలంగాణలో వరుసగా 3 రోజులు స్కూల్ హాలిడేస్?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha