Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణలో వరుసగా 3 రోజులు స్కూల్ హాలిడేస్?

తెలంగాణలో వరుసగా 3 రోజులు స్కూల్ హాలిడేస్?

వార్త 3 weeks ago

Telangana school holidays:తెలంగాణలోని స్కూళ్లు, కాలేజీలకు త్వరలో వరుసగా సెలవులు రానున్నాయి. విద్యార్థులకు వరుసగా 3 రోజులు సెలవులు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

జులై 10న వివిధ విద్యార్థి సంఘాలు రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కారణంగా విద్యాసంస్థలు మూతపడే ఛాన్స్ ఉంది. దీంతో విద్యార్థులకు అకడమిక్ పరంగా చిన్న విరామం దొరికే సూచనలు కనిపిస్తున్నాయి.

Read also: Hyderabad Cyber Crime: ఆర్మీ అధికారిని అంటూ పెళ్లి పేరుతో యువతిని మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

 Three consecutive days of holidays for students.

ఎప్పుడు సెలవులు వచ్చే అవకాశం ఉంది

జులై 10న విద్యార్థి సంఘాలు చేపట్టే బంద్ వల్ల స్కూళ్లు, కాలేజీలు బంద్ అయ్యే అవకాశం ఉంది. దీనికి తోడు జులై 11న రెండో శనివారం, జులై 12న ఆదివారం రానున్నాయి. ఇలా వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చే వీలుంది. బంద్ ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది స్థానిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను బట్టి సెలవుల విషయం స్పష్టమవుతుంది.

Telangana school holidays:బంద్ నేపథ్యంలో విద్యార్థులు గమనించాలి

ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలపై బంద్ ప్రభావం పడే అవకాశం ఉంది కాబట్టి విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి. విద్యార్థి సంఘాల నిర్ణయం మేరకు విద్యాసంస్థలు మూసివేతపై యాజమాన్యాలు నిర్ణయం తీసుకుంటాయి. సెలవుల గురించి తాజా అప్‌డేట్స్ కోసం స్కూల్ లేదా కాలేజీ అధికారులను సంప్రదించడం మంచిది. బంద్ కారణంగా తరగతులు ఉంటాయా లేదా అనే విషయంలో స్పష్టత కోసం ఎదురుచూడాలి.

Epaper: epaper.vaartha.com

బాసర ఆలయంలో చోరీకి పాల్పడిన ముగ్గురు నిందితుల అరెస్టు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha