Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెట్రోల్ బంకులను ఆకస్మిక తనిఖీ చేసిన ఆర్డిఓ వసంత బాబు

పెట్రోల్ బంకులను ఆకస్మిక తనిఖీ చేసిన ఆర్డిఓ వసంత బాబు

వార్త 1 month ago

అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

సామాన్య ప్రజలు ఎవరు ఆందోళన చెందవద్దు అవసరమైన స్టాకు అందుబాటులో ఉన్నాయి

Kalyandurgam: కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన్ పరిధిలో పెట్రోలు, డీజిల్, గ్యాస్ కొరతపై వస్తున్న వార్తల నేపథ్యంలో ఆర్డీవో వసంత బాబు సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వ హించారు.

పలు పెట్రోల్ బంకులను సందర్శించి ఇంధన నిల్వలు, విక్రయ విధానాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ, ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వినియోగదారులను కావాలనే ఇబ్బంది పెట్టే చర్యలను అసలు సహించ బోమన్నారు.

Read Also:Lemon Prices: ఆకాశాన్ని తాకుతున్న నిమ్మ ధరలు… ఒక బస్తాకు రూ.16 వేలు

నిల్వలు పుష్కలం – అక్రమాలకు తావులేదు

డివిజన్ పరిధిలో ఇంధనం తగినంతగా అందుబాటులో ఉందని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రెండు పెట్రోల్ బంకుల్లో తాత్కాలికంగా స్టాక్ కొరత ఉన్నప్పటికీ, అది మధ్యాహ్నానికి సరిచేయబడుతుందని తెలిపారు. ప్రజలకు నిరంతరాయంగా ఇంధన సరఫరా కొనసాగుతోందని వివరించారు. డివిజన్ పరిధిలో మొత్తం 46 ఫ్యూయల్ స్టేషన్లు పనిచేస్తున్నాయని, వాటిలో ఐఓసీఎల్-22, హెచ్‌పీసీఎల్-17, బీపీసీఎల్-3, నయారా-2 స్టేషన్లు ఉన్నట్లు తెలిపారు.

మండలాల వారీగా బెలుగుప్ప (7), బొమ్మనహళ్ (2), బ్రహ్మసముద్రం (1), డి.హీరేహాల్ (6), గుమ్మగట్ట (1), కళ్యాణదుర్గం (8), కంబదూర్ (6), కణేకల్ (6), కుందుర్పి (1), రాయదుర్గం (7), శెట్టూరు (1) ప్రాంతాల్లో స్టేషన్లు కొనసాగుతున్నాయి.ఇంధన సరఫరాపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ కోసం ప్రతి రిటైల్ అవుట్‌లెట్ వద్ద వీఆర్‌ఓలను నియమించి 24 గంటల నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బల్క్‌గా ఇంధనం కొనుగోలు చేసే వ్యక్తులు, సంస్థలపై ప్రత్యేకంగా নজరుంచి అవసరమైన నియంత్రణ చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేస్తే ఖబడ్దార్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha