Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెట్రోల్ ధరల సెగ: ఫుడ్ డెలివరీ ఛార్జీలపై ప్రభావం?

పెట్రోల్ ధరల సెగ: ఫుడ్ డెలివరీ ఛార్జీలపై ప్రభావం?

వార్త 3 months ago

మీకు ఆకలి వేసినప్పుడు నిమిషాల్లో వచ్చే బిర్యానీ అయినా.. వంట గదిలోకి అవసరమైన కూరగాయలైనా.. ప్రస్తుతం 10 నిమిషాల క్విక్ కామర్స్ డెలివరీ యాప్స్ ద్వారా చిటికెలో ఇంటికి వచ్చేస్తున్నాయి.

అయితే, ఆన్‌లైన్‌లో తరచూ ఆర్డర్లు పెట్టే కస్టమర్లకు రాబోయే రోజుల్లో డెలివరీ ఛార్జీల భారం పెరిగే అవకాశం కనిపిస్తోంది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడిచమురు ధరలు, భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా ఇటీవల దేశీయంగా పెరిగిన ఇంధన ధరలే దీనికి ప్రధాన కారణం. ఇటీవల లీటరుకు సుమారు రూ. 4 వరకు పెరిగిన పెట్రోల్ ధరలు ప్రభావం వల్ల ఎటర్నల్ (Eternal), స్విగ్గీ (Swiggy) వంటి ఫుడ్ డెలివరీ , క్విక్ కామర్స్ సంస్థలపై స్వల్పకాలిక ఆర్థిక ఒత్తిడి పడనుందని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ‘ఎలారా క్యాపిటల్’ తన తాజా నివేదికలో వెల్లడించింది.

Read Also: NEET Paper Leak: నాడు 'విద్యార్థులకు న్యాయం' నినాదాలు.. నేడు నీట్ పేపర్ లీక్ కేసులో అరెస్టు

 Petrol Prices

Petrol Prices: ఒక ఆర్డర్ డెలివరీ చేయడానికి ఎంత ఖర్చవుతుంది?

ఎలారా క్యాపిటల్ అంచనా ప్రకారం.. ప్రస్తుతం క్విక్ కామర్స్ (గ్రాసరీస్) లో ఒక్కో ఆర్డర్ డెలివరీ చేయడానికి కంపెనీలకు రూ. 35 నుండి రూ. 50 వరకు ఖర్చవుతోంది. అదే ఫుడ్ డెలివరీ విషయానికి వస్తే ఈ ఖర్చు రూ. 55 నుండి రూ. 60 వరకు ఉంటుంది. సగటున చూసుకుంటే ఎటర్నల్ సంస్థకు ఒక ఆర్డర్‌పై రూ. 45, స్విగ్గీ సంస్థకు రూ. 55 వరకు డెలివరీ కాస్ట్ అవుతోంది. ఈ మొత్తం డెలివరీ ఖర్చులో దాదాపు 20 శాతం కేవలం ఇంధనం (Fuel) కోసమే ఖర్చవుతుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

కర్ణాటక కాంగ్రెస్‌లో సీఎం మార్పు సెగలు.. ఢిల్లీ నిర్ణయంపైనే అందరి కళ్లు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha