Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెట్రోల్ ధరలు పెంచింది కేవలం 3 శాతమే - కేంద్ర మంత్రి

పెట్రోల్ ధరలు పెంచింది కేవలం 3 శాతమే - కేంద్ర మంత్రి

వార్త 1 week ago

శ్చిమాసియా సంక్షోభం (West Asia Conflict) కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లు దాటిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు Rs.3 మేర పెంచడంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.

ఈ ధరల పెంపును కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గట్టిగా సమర్థించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తీవ్రంగా ఉన్నప్పటికీ, భారతదేశంలో ప్రభుత్వం ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించి కేవలం పరిమితంగానే రేట్లను సవరించిందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘ ట్వీట్ చేస్తూ, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న ఆర్థిక పరిస్థితులను దేశ ప్రజల ముందు ఉంచారు.

Read Also : నీట్ పేపర్ లీక్ కేసులో కీలక సూత్రదారి అరెస్ట్

ప్రపంచ దేశాలతో పోలిక

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు సరఫరాకు తీవ్ర అంతరాయం కలగడంతో అనేక ప్రపంచ దేశాలు ఇంధన ధరలను విపరీతంగా పెంచాల్సి వచ్చిందని కిరణ్ రిజిజు గుర్తుచేశారు. ప్రపంచంలోని చాలా దేశాలు పెట్రోల్, డీజిల్ ధరలను ఏకంగా 20 శాతం నుండి 100 శాతం వరకు పెంచి తమ దేశ ప్రజలపై మోయలేని భారాన్ని మోపాయని ఆయన పేర్కొన్నారు. దానికి భిన్నంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుతూ, ప్రజా శ్రేయస్సుకు మొదటి ప్రాధాన్యతనిచ్చిందని తెలిపారు. ఈ సంక్షోభ సమయంలోనూ భారతదేశంలో పెట్రోల్‌పై కేవలం 3.2 శాతం, డీజిల్ ధరలపై 3.4 శాతం మాత్రమే స్వల్పంగా హైక్ (Hike) చేశామని ఆయన గణాంకాలతో సహా వివరించారు.

నష్టాలను భరించిన ప్రభుత్వ సంస్థలు.. బాధ్యతాయుతమైన పాలనకు నిదర్శనం

అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధరలు భారీగా పెరిగి, గ్లోబల్ మార్కెట్లు అస్థిరంగా మారినప్పటికీ, దేశీయంగా తక్షణమే ధరలను పెంచకుండా ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCs) వారాల తరబడి భారీ నష్టాలను (Under-recoveries) భరించాయని మంత్రి వెల్లడించారు. సామాన్య పౌరులపై ఆర్థిక ఒత్తిడి పడకుండా కాపాడటానికే ప్రభుత్వ చమురు సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయని, ఇది ముమ్మాటికీ ‘బాధ్యతాయుతమైన పాలన’ (Governance with responsibility) కు నిదర్శనమని ఆయన కొనియాడారు. దేశ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుతూనే, ప్రజా సంక్షేమాన్ని సమతుల్యం చేయడంలో మోదీ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని, తాజా ఇంధన ధరల సవరణ అనివార్యమైనప్పటికీ అంతర్జాతీయ పరిస్థితులతో పోలిస్తే ఇది చాలా తక్కువని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha