Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ

వార్త 2 months ago

Petrol Price Hike: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా దేశంలో పెట్రోల్, డీజిల్ మరియు వంటగ్యాస్ (LPG) ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

ఈ వార్తలతో ప్రజల్లో నెలకొన్న గందరగోళానికి చెక్ పెడుతూ కేంద్ర పెట్రోలియం శాఖ తాజాగా కీలక ప్రకటన చేసింది. దేశంలో ఇంధన ధరలను పెంచే ఆలోచన ప్రస్తుతానికి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Read Also: Kerala Assembly Elections 2026: డబ్బు కాదు.. జనమే బలం: ఎన్నికల బరిలో 26 ఏళ్ల యువతి

 Centre’s clarity on petrol and diesel price hike

Petrol Price Hike: నిజం లేని ప్రచారాలు

ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నప్పటికీ, భారత్‌లో సామాన్యులపై భారం వేసే ఉద్దేశం లేదని పెట్రోలియం శాఖ వెల్లడించింది. ఇప్పటికే పవర్ పెట్రోల్ ధరలు పెరగడంతో, సాధారణ పెట్రోల్ ధరలు కూడా పెరుగుతాయని భావించి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అయితే, ఇలాంటి పుకార్లను నమ్మి ప్రజలు ‘ప్యానిక్ బుకింగ్’ (కంగారులో ముందుగానే నిల్వ చేసుకోవడం) చేయవద్దని కేంద్రం విజ్ఞప్తి చేసింది.

రెండు నెలలకు సరిపడా నిల్వలు

దేశంలో ఇంధన కొరత ఏర్పడే అవకాశం లేదని పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ ధృవీకరించారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం రెండు నెలలకు సరిపడా పెట్రో నిల్వలు అందుబాటులో ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. అంతర్జాతీయ సరఫరా గొలుసులో అంతరాయాలు ఏర్పడినా, దేశీయ అవసరాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు.

గ్యాస్ ధరలపై కూడా స్పష్టత

డొమెస్టిక్ ఎల్పీజీ (LPG) సిలిండర్ల ధరలు కూడా పెరుగుతాయన్న వార్తలను ప్రభుత్వం కొట్టిపారేసింది. వంటగ్యాస్ ధరలను పెంచే ఉద్దేశం లేదని, సోషల్ మీడియాలో జరిగే అసత్య ప్రచారాలను నమ్మి టెన్షన్ పడవద్దని సూచించింది. ఏదైనా సమాచారం ఉంటే ప్రభుత్వం నుంచి వచ్చే అధికారిక ప్రకటనలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

తొలిసారి రూ. 2 లక్షల కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha