Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా?.. పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల క్యూ

పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా?.. పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల క్యూ

వార్త 1 month ago

Petrol Crisis: వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగుస్తుండటంతో, ఇంధన ధరలు భారీగా పెరుగుతాయనే ప్రచారం నగరవాసులను ఆందోళనకు గురిచేస్తోంది. దీనికి తోడు పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందనే భయంతో హైదరాబాద్ నగరవ్యాప్తంగా వాహనదారులు పెట్రోల్ బంకుల వద్దకు పోటెత్తారు.

నిన్నటి నుంచి నగరంలోని ప్రధాన రహదారులపై ఉన్న బంకుల వద్ద కిలోమీటర్ల కొద్దీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఇంధనం కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Read Also : Obesity : పిల్లల్లో పెరుగుతున్న స్థూలకాయ సమస్య

 Kilometer-long queues at banks.

ముగిసిన నిల్వలు.. మూతపడుతున్న బంకులు

హఠాత్తుగా పెరిగిన డిమాండ్ కారణంగా నగరంలోని పలు పెట్రోల్ బంకుల్లో నిల్వలు నిండుకున్నాయి. ముఖ్యంగా డీజిల్ కొరత తీవ్రంగా ఉండటంతో లారీలు, ఇతర భారీ వాహనాల యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. స్టాక్ లేకపోవడంతో చాలా బంకుల వద్ద 'నో స్టాక్' బోర్డులు దర్శనమిస్తున్నాయి. రద్దీని తట్టుకోలేక మరికొన్ని బంకులను యాజమాన్యాలు తాత్కాలికంగా మూసివేశాయి. స్టాక్ ఉన్న చోట వాహనదారుల మధ్య వాగ్వాదాలు, తోపులాటలు జరుగుతున్నాయి.

Petrol Crisis: సైబరాబాద్ పోలీస్ బంకు వద్ద రికార్డు స్థాయి క్యూ

నగరంలోని ఇతర బంకులతో పోలిస్తే విశ్వసనీయత ఎక్కువగా ఉండే సైబరాబాద్ పోలీస్ పెట్రోల్ బంకు వద్ద రద్దీ అదుపు తప్పింది. ఇక్కడ ఇంధనం కోసం కార్లు సుమారు రెండు కిలోమీటర్ల మేర వరుస కట్టాయి. సాధారణ ప్రజలతో పాటు క్యాబ్ డ్రైవర్లు, డెలివరీ బాయ్స్ ఇంధనం కోసం అల్లాడిపోతున్నారు. అధికారులు 'ప్యానిక్ బయ్యింగ్' వద్దని సూచిస్తున్నప్పటికీ, ధరలు పెరుగుతాయన్న ఆందోళనతో జనం ట్యాంకులు ఫుల్ చేయించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

బస్సు లారీ ఢీ.. 15 మందికి తీవ్రగాయాలు.. ముగ్గురి పరిస్థితి విషమం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha