Dailyhunt
పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల ముందు నో స్టాక్ బోర్డులు

పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల ముందు నో స్టాక్ బోర్డులు

వార్త 1 week ago

రైతులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు

Petrol and Diesel shortage: పెట్రోల్ డీజిల్ కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. వాహన దారులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

కారణం ఏమిటి అనే విషయం పై పూర్తి స్పష్టత లేదు. ఆయిల్ కంపెనీలు పూర్తిస్థాయిలో సరఫరా చేయడం లేదని పెట్రోల్ బంకుల యజమానులు అంటున్నారు. బ్లాక్లో అమ్ముకునేది కుట్ర పన్నుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా పరిస్థితి రెండు రోజుల్లో చక్కబడుతుందని అధికారులు చెబుతున్నారు. మరి ఈ పెట్రోల్ డీజిల్ కొరత సమస్యకు యుద్ధం కారణం కాదా.. అనే ప్రశ్న కూడా వినిపిస్తుంది. ప్రస్తుత పరిస్థితులు ప్రారంభమేనని కాలక్రమంగా ఈ కొరత తీవ్రమవుతుందా అన్న అను మానాలు ప్రజల్లో నెలకొన్నాయి.

Read Also :Kavita : కవిత కొత్త పార్టీ తో ఏం చేయబోతున్నారు?

 Fuel shortages in Kurnool.. No stock at banks.

Petrol and Diesel shortage: రబీ కోతల సమయంలో యంత్రాలు నిలిచిపోవడం

ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రరూపం దాల్చి వ్యవసాయ రంగంతో పాటు రవాణా వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా రబీ సీజన్ లో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్న ఈ సమయంలో డీజిల్ లభించకపోవడం రైతులకు పెద్ద సవాలుగా మారింది. వరి కోత యంత్రాలు నిలిచిపోవడంతో కోతలు ఆలస్యమవుతున్నాయి. సాధారణంగా 10 ఎకరాల వరి కోయడానికి యంత్రం 10 నుంచి 15 గంటలు పనిచేయాల్సి ఉండగా, రోజుకు 100 నుంచి 160 లీటర్ల డీజిల్ అవసరం అవుతుంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల్లో సరిపడా డీజిల్ స్టాక్ లేకపోవడంతో యంత్రాలు షెడ్లకే పరిమిత మవుతున్నాయి. కొన్ని బంకుల్లో పరిమితంగా సరఫరా ఉన్నప్పటికీ ఒక్కొక్కరికి 50 లీటర్లకు మించి ఇవ్వడం లేదని రైతులు చెబుతున్నారు.

కృత్రిమ కొరత, సరఫరా సమస్యలు

ఇక రవాణా రంగంలో కూడా ఈ కొరత ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. నగరాలు, పట్టణాల్లోని అనేక బంకుల్లో నో స్టాక్” బోర్డులు కనిపిస్తున్నాయి. స్టాక్ ఉన్న కొన్ని బంకుల వద్ద వాహనదారులు భారీగా బారులు తీరుతున్నారు. గంటల తరబడి వేచి చూసినా ఇంధనం దొరకక నిరాశతో వెనుదిరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వంటి చమురు సంస్థలు గతంలో ఒక్కో బంకుకు పూర్తి ట్యాంకర్ సరఫరా చేయగా, ప్రస్తుతం 4 వేల లీటర్ల ట్యాంకర్ను నాలుగు బంకులకు పంచు తున్నట్లు బంకు యజమానులు వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా గతంలో అమలులో ఉన్న వారం రోజుల క్రెడిట్ సౌకర్యాన్ని నిలిపివేసి, కేవలం నగదు చెల్లింపులకే సరఫరా పరిమితం చేయడం వల్ల చిన్న బంకుల యజమానులు ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పెట్రోల్ బంకు యజమానులు రాష్ట్ర స్థాయి అధికారులతో సమావేశమై సమస్యలను వివరించారు. సరఫరా సక్రమంగా లేకపోవడం, డిమాండ్ ఒక్కసారిగా పెరగడం ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు.

అధికారుల వివరణ

ఇటీవల ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల అనంతరం డీజిల్ ధరలు పెరుగుతాయనే వదంతులు వ్యాపించడంతో ప్రజలు ముందస్తుగా ఇంధనం నిల్వ చేసుకునేందుకు పరుగులు పెట్టడం కూడా కొరతకు ఒక కారణంగా భావిస్తున్నారు. దీంతో డిమాండ్ ఒక్కసారిగా పెరిగి సరఫరా వ్యవస్థపై ఒత్తిడి పెరిగింది. కొంతమంది బంకు యజమానులు డీజిల్ నిల్వ ఉంచుకుని విక్రయించకుండా బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయంపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని సరఫరాను పెంచి, బంకుల్లో సమృద్ధిగా ఇంధనం అందుబాటులో ఉండేలా చూడాలని రైతులు, వాహనదారులు విజప్తి చేస్తున్నారు. లేదంటే వ్యవసాయ పనులు, రవాణా సేవలు మరింత దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పెట్రోల్ డీజిల్ కొరతపై డిఎస్ఓ రాజా రఘువీర్ ను ప్రభాతవార్త వివరణ కోరగా.. ఆయిల్ కంపెనీల సరఫరాలో కొంత ఇబ్బందులు ఉన్నాయన్నారు. ఆ విషయాలపై రాష్ట్రస్థాయిలో వ్యాపారులకు ఆయిల్ కంపెనీల యజమాలతో అధికారులు చర్చలు జరిపారన్నారు. ఒకటి రెండు రోజులలో పరిస్థితి చక్కబడుతుందన్నారు. ఎప్పటిలాగే పెట్రోల్ డీజిల్ అందుబాటులోకి వస్తాయని రాజా రఘువీర్ వివరణ ఇచ్చారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

రాష్ట్రంలో పీకి కట్టలు కట్టామని అక్కడికి పోయారు: కేసీఆర్‌పై కవిత ఎద్దేవా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha