Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్: 'భారత్ రియాక్షన్ ఊహించలేరు'

పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్: 'భారత్ రియాక్షన్ ఊహించలేరు'

వార్త 2 months ago

Rajnath Singh: కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్థాన్‌పై చేసిన హెచ్చరికలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

పశ్చిమాసియా ఉద్రిక్తతల సాకుతో భారత్‌లో అలజడి సృష్టించాలని చూస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన ‘సైనిక్ సమ్మాన్ సమ్మేళన్’ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సరిహద్దు దేశం పాకిస్థాన్‌పై నిప్పులు చెరిగారు.

Read Also:Kerala ldf manifesto : కేరళలో LDF మేనిఫెస్టో విడుదల

 Rajnath Singh Warning to Pakistan Operation Sindhur

Rajnath Singh: పశ్చిమాసియా ఉద్రిక్తతలపై పాక్ కుట్రలు

“ప్రస్తుత పరిస్థితుల్లో మన సరిహద్దు దేశం.. భారత్ లో ఏదో సాహాసోపేతమైన చర్య చేయాలని ప్లాన్ వేస్తోంది. ఒకవేళ అదే గానీ జరిగితే భారత్ రియాక్షన్ ఊహించుకోలేని విధంగా ఉంటుంది” అని కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా పూర్తి కాలేదని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో కేవలం 22 నిమిషాల్లోనే భారత్.. ఆ దేశాన్ని ఎలా మోకాళ్లపై కూర్చోబెట్టిందో గుర్తు చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

విజయ్ నామినేషన్ ర్యాలీలో అపశృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha