Ethanol Petrol PIL: పెట్రోల్ బంకుల్లో విక్రయించే పెట్రోల్‌లో ఇథనాల్ శాతం వెల్లడించాలనే ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) సుప్రీంకోర్టు తిరస్కరణకు గురైంది.
ఈ అంశంపై సంబంధిత హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్లకు అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
Read Also:CJP నేతలేం సాధువులు కాదు అంటూ సోనమ్ వాంగుక్ కీలక వ్యాఖ్యలు

Ethanol Petrol PIL:పెట్రోల్‌లో ఇథనాల్ శాతం వెల్లడిపై కీలక ఆదేశాలు!
కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అటార్నీ జనరల్, పెట్రోల్ బిల్లులపై ఇథనాల్ శాతాన్ని తప్పనిసరిగా నమోదు చేయాలనే కోరికను గట్టిగా వ్యతిరేకించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, నేరుగా ఈ అంశంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ పిటిషన్‌ను తోసిపుచ్చింది. తగిన ఉపశమనం లేదా విచారణ కోసం సంబంధిత రాష్ట్రాల హైకోర్టులను సంప్రదించవచ్చని పిటిషనర్లకు సూచించింది. ఈ నిర్ణయంతో పెట్రోల్ బిల్లులపై ఇథనాల్ వివరాలు నమోదు చేయాలన్న పిటిషనర్ల ప్రయత్నానికి సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఇకపై ఈ అంశంపై నిర్ణయం కోసం పిటిషనర్లు హైకోర్టులనే ఆశ్రయించాల్సి ఉంటుంది.
Epaper: epaper.vaartha.com
CJP నాయకులకు రాజకీయ ఆశయాలు ఉండటంలో తప్పులేదు: సోనమ్ వాంగ్‌చుక్

