Dailyhunt
పిఆర్సి నివేదికపై జాప్యమెందుకు?

పిఆర్సి నివేదికపై జాప్యమెందుకు?

వార్త 2 weeks ago

PRC report : రెండువేల ఇరవైమూడు శాసన సభ ఎన్నికల ముందు 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధి కార పగ్గాలు చేపట్టి 27 నెలలు గడుస్తున్నా దీర్ఘకాలంగా ఎదుర్కొంటు న్న ముఖ్యమైన అనేక ఉద్యోగ, ఉపా ధ్యాయ సమస్యలను పరిష్కరించడం లో తీవ్ర జాప్యాన్ని ప్రదర్శిస్తూ మీనమేషాలు లెక్కిస్తున్నది.

విద్యా రంగంలో మాత్రం కొంత రూటు మార్చి కొత్త సమస్యలను సృష్టిస్తున్న ది. రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగ, ఉపా ధ్యాయులకు మా
ప్రభుత్వం రాగానే కొత్త పి.ఆర్.సిని ప్రకటించి ఆరు నెలలలోగా సిఫారసులను అమలు చేస్తానని హామీ ఇచ్చారు. కానీ నేటి వరకు సిఫారసులు కమిషన్ నుండి తెప్పించుకోలేదు. పైగా మొదటి వాయిదా ఏప్రిల్ 2024 నుండి అక్టోబర్ 24 వరకు ఆరు నెలలు, రెండవ వాయిదా అక్టోబర్ 24 నుండి31 మార్చి 2026 వరకు, మూడవ వాయిదా మార్చి 2026 నుండి 30 సెప్టెంబర్ 2026 వరకు ముచ్చటగా మూడోసారి వాయిదా వేసి ఉపాధ్యాయ, ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురి చేశారు.

Read Also : NHAI New Toll Rules: ఏప్రిల్ 1 నుంచి టోల్ వద్ద నగదు రద్దు.. యూపీఐతో టోల్ చెల్లింపు

 PRC report

PRC report: పీఆర్సీల మధ్య సంవ త్సరాలుగా జాప్యం

ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు వేతనాలను స్థిరీకరించి తాజాగా వేతనాలను సవరించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వేతన సవరణ సంఘం సి ఫారసులు చేయాల్సిన అవసరం ఉంది . వేతన సవరణ సంఘం ప్రతిపాదించే పీఆర్సీ తాజా ద్రవ్యోల్బణం ఐదేళ్లలో ధరల స్థిరీకరణ, సూచికను పరిశీలించాలి. గత పీఆర్సీ నివేదికలను పరిశీలించి, లోపాలను సవరించి వేతన సవరణ తేదీ నాటికి ఉన్న మూలవేతనం, కరువు భత్యం, ఫిట్మెంట్లను కలిపి వచ్చిన మొత్తాలను తాజాగా మూల వేతనాలుగా పూర్తి చేసి తాజా మాస్టర్ స్కేల్, ఇంక్రిమెంట్లు శాస్త్రీయంగా ప్రతిపాదించాల్సిన ఆవశ్యకత కమిటీకి ఉం టుంది. పీఆర్సీలు రూపుదిద్దుకోవడం కోసం ఉద్యోగ, ఉపా ధ్యాయ సంఘాలు అనేక పోరాటాలు చేసి తమ హక్కుగా సాధించుకున్నారు. అలాంటి హక్కును కాలరాసే ప్రయత్నా న్ని ప్రభుత్వాలు విడనాడుకోవాలి. పీఆర్సీల మధ్య సంవ త్సరాలుగా జాప్యాలను నివారించాలి. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల పొట్ట కొట్టకూడదు, తెలంగాణ రాష్ట్రంలో మొదటి పీఆర్సీ గడుగు 2023 జూన్ 30వ తేదీతో ముగిసింది. 1 జులై 2023 నుండి తెలంగాణ రాష్ట్ర రెండో పీఆర్సీని ఇవ్వాల్సి ఉంది.

గత ప్రభుత్వం 2 అక్టోబర్ 2023న రిటైర్ ఐఏఎస్ ఆఫీసరు చైర్మన్గా నియమిస్తూ వేతన సవరణ (Wage Revision)సంఘాన్ని నియమించింది. ఆరు నెలల్లోగా రిపోర్టు తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించింది. అనేక పర్యాయాలు చర్చించి ఉద్యోగ సంఘాల నుండి ప్రతి పాదనలు స్వీకరించింది. సుదీర్ఘ కసరత్తు తరువాత కొన్ని నెలల క్రితమే పీఆర్సీ నివేదిక సిద్ధమైంది. రిపోర్టును సమ ర్పించేందుకు అధికారులు ప్రభుత్వ అనుమతి కోరారు . కానీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు సరికదా ఉద్యోగ వర్గం కండ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూడాల్సిన పరి స్థితి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం 2026 బడ్జెట్లో విద్యారం గానికి కనీసం 20 శాతం నిధులు కేటాయిస్తారని ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆశించారు. కానీ అందుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం 3,24,234 కోట్ల రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 26,674 కోట్లు (8.22 శాతం) కేటాయించింది. అందులో పీఆర్సీ ఊసే ఎత్తకుండా ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలలో నిరాశ నిస్పృహలకు లోనయ్యే విధంగా వ్యవహరించింది. ప్రభుత్వం అధిక నిధులు కేటాయించి, వేతన సవరణ (Wage Revision) సం ఘాన్ని పిలిచి నివేదిక తెప్పించుకొని పీఆర్సీ అమలు చేస్తా రని ఆశించారు. కానీ ఆశలు అడియాశలు అయ్యాయి. ప్రభుత్వ ఆలోచన సమస్యల నుండి ఒడ్డెక్కే దాకా ఓడ మల్లయ్య ఒడ్డెక్కాక బోడ మల్లయ్య అనే చందంగా ఉంది.

 PRC report

వాయిదావేయడం సరైన పద్ధతి కాదు

గత బడ్జెట్ కంటే 6.7 శాతాన్ని పెంచి చేతులు దులుపుకుం ది. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకుండా ప్రభుత్వం దాటేసింది. తెలంగాణ మొదటి పీఆర్సి సిఆర్|బిశ్వాస్ చైర్మన్గా 2018లో మే 18న కమిటీ ఏర్పాటు చేసి, 2021 నుండి 43 ఫిట్మెంట్తో పీఆర్సీని అమలు చేసింది. ప్రభుత్వంపై ఏడాదికి 12,595కోట్ల అదనపు భారం పడిన కరోనా కష్టా లు వెంటాడినా, రాష్ట్ర అభివృద్ధిలో ఉపాధ్యాయ, ఉద్యో గుల పాత్రను గుర్తించి భారాన్ని భరించేందుకు సిద్ధపడ్డది, ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఈ సమాజంలో అంత ర్భాగమే. మూడు, నాలుగు దశాబ్దాల పాటు సమాజాభి వృద్ధిలో, విద్యాభివృద్ధిలో ఎనలేని సేవ చేసి తమ రక్తాన్ని చెమటగా ధారపోసి ప్రజలకు సేవ చేస్తున్నారు, ఇలాంటి వర్గాల వారిని చిన్నచూపు చూడడం వారి పరిస్థితిని అర్థం చేసుకోకపోవడం సరైంది కాదు. హామీలు ఇచ్చి గట్టెక్కిన పాలకులు అరుపులు, పెడబొబ్బలతోబాధ్యతల నుంచి తప్పించుకోలేరు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 27 నెలలు గడుస్తున్నా పీఆర్సి నివేదికను తెప్పించుకో కుండా అమలు చేయకుండా గత ప్రభుత్వంపై ఆడిపోసు కుని పబ్బం గడుపుకోవడం దుర్మార్గమైన ఆలోచన. ప్రభు త్వం తాను అనుకున్న పథకాలకు వేల కోట్లు మంజూరు చేస్తూ అందాలకు, విందులకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఖజానా ఖాళీ అయిందని చెప్పడం ఎంతవరకు సమంజసం. సెప్టెంబర్ 2026 వరకు పీఆర్సీ నివేదికను వాయిదావేయడం సరైన పద్ధతి కాదు. వెంటనే ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకొని పీఆర్సీ నివేదికను తెప్పించుకొని ఐదు శాతం ఐఆర్ తోపాటు 40 శాతం ఫిట్మెంట్తో 1జులై 2023 నుండి అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది.

-జి. తిరుపతిరెడ్డి

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

స్పామ్ కాల్స్‌ను ఇలా అడ్డుకోండి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha