Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పిడుగురాళ్లలో అత్యధికంగా 48 డిగ్రీల ఉష్ణోగ్రత

పిడుగురాళ్లలో అత్యధికంగా 48 డిగ్రీల ఉష్ణోగ్రత

వార్త 9 hrs ago

High Temperature : ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మునుపెన్నడూ లేని విధంగా ముదిరిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తుండటంతో జనం విలవిలలాడుతున్నారు.

ముఖ్యంగా పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్లలో అత్యధికంగా 48.14 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదై రికార్డు సృష్టించింది. కేవలం పల్నాడు ప్రాంతమే కాకుండా, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల మార్కును దాటిపోయాయి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 47.17 డిగ్రీలు, కృష్ణా జిల్లా నందివాడలో 47.1 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలై, మధ్యాహ్నానికి బయటకు రావాలంటేనే ప్రజలు జంకేలా నిప్పుల గాలి వీస్తోంది.

Read Also : మే 31తో ముగియనున్న వేసవి సెలవులు!

 Telangana heat wave high temperature

ప్రజలకు విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక

కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని మిగతా జిల్లాల్లోనూ ఇదే తరహా వాతావరణం కనిపిస్తోంది. ఏలూరు జిల్లా చింతలపూడిలో 46.94 డిగ్రీలు, పశ్చిమ గోదావరి జిల్లా గణపవరంలో 46.82 డిగ్రీలు, తూర్పు గోదావరి జిల్లా గోపాలపురంలో 46.78 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఈ తీవ్రమైన హీట్‌వేవ్ (వడగాల్పులు) పరిస్థితుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ప్రజలను అప్రమత్తం చేసింది. రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నందున, అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దని హెచ్చరించింది. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు, చిన్న పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు నిరంతరం మంచినీరు, ఓఆర్ఎస్ లేదా మజ్జిగ వంటి ద్రవపదార్థాలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

రొయ్యల ధరలు పడిపోవడంతో ఆక్వా రైతుల ఆవేదన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha