Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్..మారిన విత్ డ్రా నిబంధనలు

పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్..మారిన విత్ డ్రా నిబంధనలు

వార్త 2 weeks ago

EPFO New Rules: భారత ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన కోట్లాది మంది చందాదారులకు భారీ ఊరట నిచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ డబ్బుల విత్‌డ్రా (PF Withdrawal) మరియు నెలవారీ కాంట్రిబ్యూషన్ నిబంధనలను సులభతరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులను తీసుకొచ్చింది.

జూన్ 29 నుంచి పాత ‘1952 పీఎఫ్ పథకం’ స్థానంలో నూతన ‘ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ పథకం 2026’ (EPF Scheme 2026) ను అమల్లోకి తీసుకొచ్చారు. నూతన నిబంధనల ప్రకారం పీఎఫ్ అడ్వాన్స్, కాంట్రిబ్యూషన్స్ మరియు ఉద్యోగం మారినప్పటి విత్‌డ్రా పరిమితుల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

Read Also :APY Scheme:నెలకు రూ.42 కడితే రూ.5,000 పెన్షన్..ఏపీ ప్రజలకు కేంద్రీయ పింఛన్ బంపర్ ఆఫర్!

EPFO New Rules: నూతన ఈపీఎఫ్ (EPF 2026) నిబంధనలలోని ప్రధాన మార్పులు

  1. విత్‌డ్రా కేటగిరీల తగ్గింపు:గతంలో ఉద్యోగంలో ఉన్నప్పుడు పీఎఫ్ అడ్వాన్స్ తీయడానికి 13 రకాల కేటగిరీలు ఉండేవి. నూతన విధానంలో వాటిని కేవలం 3 ప్రధాన కేటగిరీలుగా కుదించారు.
  2. ఆరోగ్య అవసరాలకు 100% విత్‌డ్రా:మెడికల్ ఎమర్జెన్సీ (ఆరోగ్య అవసరాల) కింద అర్హత ఉన్న పీఎఫ్ బ్యాలెన్స్‌లో 100 శాతం వరకు డబ్బులను ఉపసంహరించుకోవచ్చు. అయితే దీనికి కనీసం 12 నెలల పాటు పీఎఫ్ ఖాతాదారుడిగా సభ్యత్వం ఉండాలి.
  3. విద్య, వివాహం మరియు ఇంటి నిర్మాణ పరిమితులు:
    • చదువుల కోసం: జీవితకాలంలో కనీసం 10 సార్లు పాక్షికంగా డబ్బులు తీసుకోవచ్చు.
    • వివాహాల కోసం: జీవితకాలంలో 5 సార్లు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
    • ఇల్లు / హోమ్ లోన్ / పునరుద్ధరణ: జీవితకాలంలో గరిష్టంగా 5 సార్లు ఉపసంహరించుకోవచ్చు (12 నెలల సర్వీస్ నిబంధన వర్తిస్తుంది).
  4. వాలంటరీ కాంట్రిబ్యూషన్ (చందా పెంపు):రూ.15,000 కంటే ఎక్కువ వేతనం ఉన్న ఉద్యోగులు తమ నెలవారీ పీఎఫ్ చందాను (12% లేదా రూ.1,800 కంటే ఎక్కువ) స్వచ్ఛందంగా పెంచుకోవచ్చు. ఉద్యోగి పెంచిన మొత్తానికి సమానంగా యాజమాన్యం కూడా చందా అందించాల్సి ఉంటుంది. ఈ అదనపు విరాళాన్ని ఉద్యోగి ఎప్పుడైనా నిలిపివేయవచ్చు లేదా తగ్గించుకోవచ్చు.
  5. ఉద్యోగం వదిలేసిన తర్వాత విత్‌డ్రా రూల్:ఉద్యోగం మానేసిన వెంటనే పీఎఫ్ ఖాతాలోని మొత్తం బ్యాలెన్స్‌ను విత్‌డ్రా చేయడం కుదరదు. ప్రాథమికంగా 75 శాతం మొత్తం మాత్రమే ఉపసంహరించుకోవచ్చు. మిగిలిన 25% సహా పూర్తి మొత్తాన్ని ఉద్యోగం వదిలిన 12 నెలల (ఏడాది) తర్వాత మాత్రమే డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించారు.

రైతన్నలకు త్వరలోనే ఖాతాల్లోకి పీఎం కిసాన్ 24వ విడత నగదు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha