Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రైతన్నలకు త్వరలోనే ఖాతాల్లోకి పీఎం కిసాన్ 24వ విడత నగదు!

రైతన్నలకు త్వరలోనే ఖాతాల్లోకి పీఎం కిసాన్ 24వ విడత నగదు!

వార్త 2 weeks ago

PM Kisan Update: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) 24వ విడత నిధుల కోసం ఎదురుచూస్తున్న రైతన్నల నిరీక్షణకు త్వరలోనే తెరపడనుంది. కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.

2,000ల ఆర్థిక సాయం అక్టోబర్ నెలలో జమ అయ్యే అవకాశం ఉంది.

Read Also : FASTag Local Pass: టోల్ ఛార్జీల బాదుడుకు చెక్.. నెలకు రూ.340తో అన్‌లిమిటెడ్ జర్నీ

PM Kisan Update: ఇప్పటివరకు రూ. 4.47 లక్షల కోట్ల సాయం

కేంద్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలిచేందుకు పీఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటివరకు 23 విడతలలో కలిపి ఏకంగా రూ. 4.47 లక్షల కోట్లను ప్రత్యక్ష నగదు బదిలీ (DBT) విధానంలో నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి అందించింది. ఇటీవల విడుదలైన 23వ విడత ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 9.49 కోట్లకు పైగా రైతు కుటుంబాలు లబ్ధి పొందాయి.

రాబోయే 24వ విడతలో ఇ-కేవైసీ (e-KYC), ఆధార్ సీడింగ్ ప్రక్రియలను పూర్తి చేసుకున్న మరికొంతమంది నూతన రైతులకు కూడా ప్రయోజనం అందే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అర్హులైన రైతులందరికీ సమయానికి నిధులు చేరేలా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అవసరమైన చర్యలు వేగవంతం చేస్తోంది.

ఒంటరితనంతో చనిపోయి అస్థిపంజరంగా మారిన తల్లి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha