ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన కోట్లాది మంది ఖాతాదారులకు కీలక సూచనలు జారీ చేసింది. ఉద్యోగాలు మారే సమయంలో పీఎఫ్ ఖాతాలో వివరాలను సరిచూసుకోకపోతే భవిష్యత్తులో పెన్షన్, పీఎఫ్ విత్‌డ్రా వంటి విషయాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించింది.
Read Also: Tamil Nadu Elections 2026: విజయ్ రాకపోయినా విగ్రహంతో నామినేషన్
Shock for PF users.. If that one date is wrong, you won’t get any money!
EPFO: జాయినింగ్, ఎగ్జిట్ తేదీలే కీలకం
ఒక కంపెనీ నుండి మరో కంపెనీకి మారేటప్పుడు పీఎఫ్ ఖాతాలో జాయినింగ్ డేట్ (Joining Date) మరియు ఎగ్జిట్ డేట్ (Exit Date) కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చూసుకోవడం అత్యంత ముఖ్యం. చాలామంది ఉద్యోగం వదిలేశాక ఈ వివరాలను పట్టించుకోరు. కానీ, రిటైర్మెంట్ తర్వాత మీకు వచ్చే పెన్షన్ అర్హతను ఈ తేదీలే నిర్ణయిస్తాయి. ఒకవేళ తేదీల్లో పొరపాట్లు ఉంటే: పీఎఫ్ క్లెయిమ్స్ తిరస్కరణకు గురవ్వచ్చు. పీఎఫ్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేయడంలో ఆలస్యం జరగొచ్చు. సర్వీస్ కాలం తప్పుగా నమోదైతే పెన్షన్ మొత్తం తగ్గే అవకాశం ఉంది.
ఆన్‌లైన్‌లోనే అప్‌డేట్ చేసుకునే అవకాశం
పీఎఫ్ వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్ ద్వారా ఎగ్జిట్ తేదీని సులభంగా సరిచేసుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయక్కర్లేదు. మీ జాయినింగ్, ఎగ్జిట్ తేదీలు మీ పీఎఫ్ కాంట్రిబ్యూషన్ రికార్డులతో సరిపోలితే సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఆమోదిస్తుంది.
కంపెనీ మూతపడినా పరిష్కారం ఉంది
మీరు గతంలో పనిచేసిన కంపెనీ మూసివేసినా లేదా పాత యజమాని స్పందించకపోయినా ఆందోళన చెందొద్దు. అటువంటి వారు ‘జాయింట్ డిక్లరేషన్ ఫారమ్’ (Joint Declaration Form) పూర్తి చేసి నేరుగా ఈపీఎఫ్‌వో కార్యాలయంలో సంప్రదించాలి. అధికారులు మీ రికార్డులను పరిశీలించి వివరాలను అప్‌డేట్ చేస్తారు. భవిష్యత్తులో ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఇప్పుడే మీ యూఏఎన్ (UAN) పోర్టల్‌లో లాగిన్ అయ్యి వివరాలు చెక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

