Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పీఎం కిసాన్ 24వ విడత ఎప్పుడంటే?

పీఎం కిసాన్ 24వ విడత ఎప్పుడంటే?

వార్త 2 weeks ago

PM Kisan: దేశవ్యాప్తంగా ఉన్న అన్నదాతలు ప్రతిష్టాత్మక 'ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి' (పీఎం కిసాన్‌) పథకం తదుపరి విడత కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.2,000 చొప్పున ఏడాదికి రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత జూన్‌లో 23వ విడత నిధులు విడుదల కాగా, ఇప్పుడు 24వ విడత పంపిణీకి రంగం సిద్ధమవుతోంది. రాబోయే అక్టోబర్‌ నెలలో దుర్గా పూజ పండుగ కంటే ముందే ఈ నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉందని సమాచారం.

అర్హులైన రైతులకు రూ.4,000 అందే ఛాన్స్

గత విడత సమయంలో ఈ-కేవైసీ (e-KYC) పూర్తి కాకపోవడం, భూమి ధృవీకరణ (Land Verification) వంటి సాంకేతిక సమస్యల కారణంగా కొందరు రైతులకు రూ.2,000 సాయం జమ కాలేదు. అయితే, ఆయా సమస్యలను పరిష్కరించుకున్న రైతులకు గతంలో ఆగిపోయిన బకాయి మొత్తం రూ.2,000 తో పాటు, రాబోయే 24వ విడత నిధులు రూ.2,000 కలిపి మొత్తం రూ.4,000 ఒకేసారి వారి ఖాతాల్లో పడే అవకాశం ఉంది. కాబట్టి రైతులు తమ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.

Epaper: epaper.vaartha.com

100 మంది ఐఐటీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు.. హిమంత బిశ్వ శర్మ కీలక ప్రకటన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha