Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పీఎం కిసాన్ 24వ విడతపై రైతులకు గుడ్‌న్యూస్

పీఎం కిసాన్ 24వ విడతపై రైతులకు గుడ్‌న్యూస్

వార్త 1 week ago

PM Kisan 24th Installment: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం కింద 24వ విడత ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్న కోట్లాది మంది రైతులకు శుభవార్త అందింది.

ప్రతి నాలుగు నెలలకొకసారి రైతులకు అందుతున్న ఈ విడత సాయం 2026 అక్టోబర్‌లో అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.6,000 చొప్పున, ప్రతి నాలుగు నెలలకు రూ.2,000 లొప్పున మొత్తం మూడు విడతలలో ఆర్థిక సాయాన్ని అందిస్తోంది.

PM Kisan 24th Installment: ఈ-కేవైసీ (e-KYC) తప్పనిసరి - స్టేటస్ చెక్ చేసుకోండి

పీఎం కిసాన్ 24వ విడత సాయం ఎలాంటి ఆటంకం లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లో జమ కావడానికి ఈ-కేవైసీ (e-KYC) పూర్తి చేయడం తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు. బ్యాంక్ ఖాతాతో ఆధార్ కార్డు అనుసంధానం మరియు భూమి వివరాల ధృవీకరణ పూర్తయిన రైతులకు మాత్రమే ఈ నిధులు జమవుతాయి.

రైతులు తమ లబ్ధిదారుల స్టేటస్‌ను సులభంగా తెలుసుకోవడానికి అధికారిక పోర్టల్ pmkisan.gov.inసందర్శించి తమ ఆధార్ సంఖ్య లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా ఫార్మర్ కార్నర్ లోని విభాగంలో వివరాలను తనిఖీ చేసుకోవచ్చు.

ఆగస్టు 1 నుంచి చక్కెర పై కొత్త నిబంధనలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha